భారత రాజకీయాల్లో మరో రహస్యం వెలుగుచూసింది. దేశంలో ఎవరు అధికారంలో వున్నా.. ప్రతిపక్షాలకు చెందిన పలు విషయాలను వెలుగులోకి తీసుకురావడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోతోంది. ఈ నేపత్యంలో భారత్ తొలి రాష్ట్రపతిగా రాజగోపాలాచారిని నియమించేందదుకు అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ.. అబద్దాలు కూడా ఆడారని ఇటీవల ఓ పుస్తకం వెలుగులోకి తీసుకువచ్చింది. స్వతంత్ర భారతవని తొలి రాష్ట్రపతిగా ఖ్యాతినందుకుంటున్న రాజేంద్రప్రసాద్‌ను ఆ పదవిలో నియమించడం ప్రధాని నెహ్రూకు ఇష్టం లేదని ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారి ఆర్ఎన్‌పీ సింగ్ ‘నెహ్రూ: ఎ ట్రబుల్డ్ లెగసీ’ అనే పుస్తకంలో వెల్లడించారు. తొలుత భారత ప్రథమ రాష్ట్రపతిగా సీ రాజగోపాలచారికి అవకాశమివ్వాలని నెహ్రూ భావించారట. ఈ విషయాన్ని సెప్టెంబర్ 10 1949లో రాజేంద్రప్రసాద్‌కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారని ఆ పుస్తకంలో రాశారు.
‘భారత తొలి రాష్ట్రపతిగా రాజగోపాలాచారి అయితేనే మంచిదని నేను, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించామని నేహ్రూ రాజగోపాలాచారికి ఓ లేఖ రాశారు. అది చదివి తీవ్ర అసంతృప్తికి, వేదనకు గురైన రాజేంద్రప్రసాద్.. తన భాదను వ్యక్తం చేస్తూ.. పటేల్‌కు లేఖ రాశారు. దానితోపాటు నెహ్రూ రాసిన ఉత్తరాన్ని కూడా దానికి జత చేశారు. ఈ లేఖ చదివి పటేల్ ఆశ్చర్యపోయారు. తనతో ఎప్పుడు రాష్ట్రపతి పదవి గురించి నెహ్రూ చర్చించలేదని వాపోయిన సర్థార్ పటేల్.. ఆవిషయాన్ని పక్కన బెట్టి. నెహ్రూకు లేఖ రాస్తూ.. పార్టీలో ఎంతో సీనియరైన రాజేంద్ర ప్రసాద్‌తో మరింత హుందాగా ప్రవర్తించి ఉంటే బాగుండేదని సూచించారు. ఈ లేఖ చదివిన నెహ్రూ.. పరిస్థితి తన చేయి దాటిపోతోందని భావించారు. పటేల్, ప్రసాద్‌ల దృష్టిలో తాను చులకనైపోయానని భావించారు. అనంతరం పరిస్థితిని అంతా వివరిస్తూ రాజేంద్రప్రసాద్‌కు ఓ లేఖ రాశారు. ఇక ఈ విషయంలో వేలు పెట్టడం ఇష్టం లేక రాష్ట్రపతి బాధ్యతను పటేల్ చేతిలోనే నెహ్రూ పెట్టార’ని ఆ పుస్తకంలో సింగ్ రాసుకోచ్చారు.
అయితే అందరూ దేశం కోసం పోరాడిన యోధులే. తమ యవ్వన దశ నుంచి దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఉద్యమించిన నాయకులే. అయితే వారిలో వారికి పొరపచ్చాలు లేకపోవచ్చు. అయితే ఒకరిపై అధిక చనువు, మరోకరితో కొంత కలుపుగోలు తనం, ఇంకోందరితో పరిమితమైన పరుధుల లోపు మాత్రమే స్నేహాలు వుండవచ్చు. అయితే తన అనుకున్న వారికి పదవి లభించేందుకు అప్పట్లోనూ నేతలు యత్నాలు చేసివుండవచ్చు. అయితే వారు లేని సమయంలో, తిరిగి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోలేరని తెలిసిన పరిస్థితులలో ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకోచ్చి.. స్వతంత్ర్య సమరయోధులకు పరాభవం కలిగేలా రచనలు చేయడం ఎంతవరకు సమంజసమో.. రచయితలకే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more