chennai egmore court issued notice to hero dhanush in kakka muttai movie controversy

Chennai egmore court issued notice to hero dhanush kakka muttai movie

chennai egmore court, hero dhanush, court summons dhanush, kakka muttai movie, kollywood news, tamil movies

chennai egmore court issued notice to hero dhanush kakka muttai movie : chennai egmore court issued notice to hero dhanush in kakka muttai movie controversy.

నటుడు ధనుష్ కు నోటీసులు జారీ చేసిన కోర్టు

Posted: 06/27/2015 11:01 AM IST
Chennai egmore court issued notice to hero dhanush kakka muttai movie

వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కి చెన్నైలోని ఎగ్మూర్ కోర్టు ఝలకిచ్చింది. తాను నటించిన ఓ చిత్రంలో న్యాయవాదులను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన నేపథ్యంలో ధనుష్ కి కోర్టు నోటీసులు పంపింది. అతనితోపాటు సదరు మూవీ దర్శకనిర్మాతలకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ సంయుక్తంగా ‘కాక్కముట్టై’ అనే చిత్రాన్ని నిర్మించారు. మణికంఠన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. ‘న్యాయవాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు వున్నాయంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘ పరిక్షరణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ పిటిషన్ వేశాడు. దీనిపై ఎగ్మూర్ మెజిస్ట్రేట్ మురుగన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున నమోనారాయణ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఆ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విధంగా న్యాయవాది వినిపించిన వాదనలను విన్న అనంతరం మెజిస్ట్రేట్ మురుగన్.. ఆ సినిమా నిర్మాతలైన ధనుష్, దర్శకుడు వెట్రిమారణ, ఈ చిత్ర దర్శకుడు మణికంఠన్ లకు సమన్లు జారీ చేశారు. మరి.. దీనిపై ఆ మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chennai egmore court  dhanush  kakka muttai movie  

Other Articles