ఎదురులేని చరిష్మాతో, తిరుగులేని మెజారిటీతో ప్రదాని పీఠాన్ని కైవసం చేసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి గడ్డుకాలం నడుస్తోంది. బిజెపి పార్టీ కీలకేనేతలపై లలిత్ మోదీ వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే తాజాగా బిజెపి పార్టీపై విపక్షాలు కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ముంబైలోని కొబాలా నియోజక వర్గం ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి, బిజిపె అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు సమిష్టి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కానీ ప్రస్తుతం అది ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. నరేంద్ర మోదీతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పైనా విమర్శలు చేశారు. అయితే మహారాష్ట్ర నవసేన అధినేత రాజ్ థాక్రే ను బోగస్ నాయకుడు అని అనడంతో రాజ్ పురోహిత్ కార్యాలయంపై దాడి జరిగింది.
నరేంద్ర మోదీ, అమిత్ షాల ఆదిపత్యం పార్టీలో నడుస్తోందని రాజ్ పురోహిత్ అన్నారు. అయితే నరేంద్ర మోదీ పని తీరు చాలా బాగుందని కానీ తప్పులను ఆయన సరిదిద్దుకోవాలని అన్నారు. ఓ టీవీ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో రాజ్ పురోహిత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలాన్ని సృష్టించాయి. అయితే నల్లధనం వెనక్కి తీసుకువస్తామని బిజెపి పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కాగా మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజ్ పురోహిత్ మాట మార్చారు. అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తన వాయిస్ ను కూడా ఎవరో ఇమిటేట్ చేశారని అన్నారు. అయితే దీనిపై మహారాష్ట్ర బిజెపి పార్టీ గుర్రుగాఉంది. రాజ్ పురోహిత్ నుండి వివరణ కోరింది. అయితే ఈ టేపులను టెస్టుల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపనున్నట్లు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షులు తెలిపారు. అయితే అసలే లలిత్ మోదీ వ్యవహారంతో బిజెపి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి మంచి అవకాశం లభించినట్లైంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more