stephenson, case, high court. cash for vote, mathayya

Stephene got shock from high court

stephenson, case, high court. cash for vote, mathayya

Stephene got shock from High court. High court order to dismiss the stephenson petetion and order to file case on stephenson.

స్టీఫెన్ సన్ కు షాక్.. పిటిషన్ కొట్టివేత.. కేసు నమోదు

Posted: 06/29/2015 11:39 AM IST
Stephene got shock from high court

ఓటుకు నోటు వ్యవహారం కీలక ములుపులు తిరుగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కిన స్టీఫెన్ సన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తన మీద కావాలనే కేసులు బనాయించారని, వాటిని కొట్టివెయ్యాలని కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై స్టీఫన్ సన్ ను తప్పించకుండా ఉండడానికి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే ప్రస్తుతం ఈ కేసు నడుస్తున్న బెంచ్ లోని న్యాయమూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని కాబట్టి కేసుపు వేరే బెంచ్ కు మార్చాలని పిటిషన్ లో కోరారు. అయితే రెండు వైపుల వాదనలు విన్న కోర్టు స్టీఫెన్ సన్ పిటిషన్ ను కొట్టి వేసింది. అలాగే కేసు వ్యవహారంలో ఎవరూ ఎలాంటి పక్షపాతానికి లోనుకావడం జరగదు అని, కేవలం కోర్టును తప్పుదారి పట్టించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. అలాగే కోర్టు ధిక్కరణ కింద స్టీఫెన్ న్ పై కేసు నమోదు చెయ్యాలని కూడా హైకోర్టు ఆదేశం జారీచేసింది. మొత్తానికి స్టీఫెన్ సన్ పిటిషన్ కొట్టివేయండతో పాటుగా రివర్స్ లో కేసు కూడా నమోదు కావడం విశేషం. అయితే మత్తయ్య అరెస్టు మీద ఉన్న స్టే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి రేవంత్ రెడ్డి బెయిల్ పై ఎలాంటి తీర్పు వెలువడుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stephenson  case  high court. cash for vote  mathayya  

Other Articles