modi | Twitter | selfie with daughter

Amazing response on modi call for selfie with daughter

modi, Twitter, selfie with daughter

Amazing response on modi call for selfie with daughter. Prime Minister Narendra Modi on Sunday urged the country to join his campaign 'Beti Bachao, Beti Padhao' (Save your Daughter, Teach your Daughter), in order to save the girl child in India. Speaking on the radio program Mann Ki Baat, Modi expressed his concern about the declining sex ratio in several districts of India.

ఇప్పుడు సెల్ఫీ కాదు.. సెల్ఫీ విత్ డాటర్ టైం

Posted: 06/29/2015 12:50 PM IST
Amazing response on modi call for selfie with daughter

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు సోషల్ మీడియాలో ప్రభంజానాన్ని సృష్టిస్తోంది. అప్పుడెప్పుడో చైనా పర్యటన సందర్భంగా తీసుకున్న సెల్ఫీలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాది బెస్ట్ సెల్ఫీ కూడా అయ్యాయి. అయితే తాజాగా సెల్ఫీ స్టైల్ ను మార్చారు మోదీ. రోజు రోజుకు తగ్గుతున్న బాలికల నిష్పత్తి మీద మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల పట్ల వివక్ష తగదని దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ లో భాగంగా మాట్లాడిన మోదీ సెల్ఫీ విత్ డాటర్ అనే కొత్త సెల్ఫీ స్టైల్ కు పిలుపునిచ్చారు. ట్విట్టర్ లోని సెల్ఫీ విత్ డాటర్ అకౌంట్ లో వీటిని పోస్ట్ చెయ్యమని పిలుపునిచ్చారు.

modi-twitter-on-selfie-with

అయితే నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది. చాలా మంది తండ్రులు తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేసిన వారిలొ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేద్ర ఫడ్నవిస్ తో సహా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కిరణ్ బేడి తన చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చెయ్యగా, ఇందిరాగాంధీ ఫోటోలు, మహేష్ బాబు కూతరి ఫోటోలతో పాటుగా విదేశీయులు కూడా మోదీ పిలుపుకు స్పందించారు. చాలా మంది తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి మోదీ ఇచ్చిన సెల్ఫీ విత్ డాటర్ నెట్ ప్రపంచంలో దుమారాన్నే రేపుతోంది.

selfie-with-daughter-accoun

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  Twitter  selfie with daughter  

Other Articles