Revanth Reddy | cash for vote | Court | remand | Bail | ACB | Telangana

Revanth reddy didnt get bail and sent custody for two more weeks

Revanth Reddy, cash for vote, Court, remand, Bail, ACB, Telangana

Revanth reddy didnt get bail and sent custody for two more weeks. The ACB special court pronounce the remand for two more weeks to Revanth Reddy in cash for vote case.

రేవంత్ రెడ్డి మూడోసారి కూడా.. పాపం బ్యాడ్ టైం

Posted: 06/29/2015 01:26 PM IST
Revanth reddy didnt get bail and sent custody for two more weeks

ఓటుకు నోటు కేసులో ఏ1 ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఇప్పటికి రెండు పార్లు బెయిల్ పిటిషన్ పై నిరాశ చెందిన రేవంత్ కు మరోసారి కూడా అదే నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసులో ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటూ చ‌ర్లప‌ల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి జూలై 13 వ‌ర‌కు రిమాండు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. వాస్త‌వానికి జూన్ 1వ తేదీని అరెస్టయిన రేవంత్‌కు ఇప్పటికి రెండుసార్లు రిమాండు పొడిగించారు. ఈరోజుతో రెండోసారి రిమాండు గ‌డువు కూడా ముగియ‌డంతో ఆయ‌న‌ను ఆయ‌న‌తోపాటు స‌హ‌నిందితులు సెబాస్టియ‌న్‌ను, ఉద‌య‌సింహ‌ ఏసీబీ కోర్టు ముందు హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ ఇంకా కొన‌సాగుతున్నందున వీరి రిమాండును పొడిగించాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టుకు మెమో దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయ‌మూర్తి మ‌రో 14 రోజుల‌పాటు రిమాండు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  cash for vote  Court  remand  Bail  ACB  Telangana  

Other Articles