పెద్దలు తమ పెళ్లిని అంగీకరించకపోతే చాలు.. ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడటమో, లేచిపోవడమో, ఎవరికీ తెలియకుండా ఆర్యసమాజ్ లేదా గుడిలో పెళ్లిచేసుకోవడమో వంటి చర్యలకు పాల్పడుతుంటారు. వీటిల్లో ఎక్కువగా కనిపించే వైనాలు ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకోవడం. ముందుగా ఓ ప్లాన్ వేసుకోవడం, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోవడం, ఆ తర్వాత ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకోవడం.. ఇలా ఎన్నో జంటలు చేస్తుంటాయి. ఈ తరహాలోనే ఓ జంట ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంటుండగా.. వారి పెళ్లిని అమ్మాయి కుటుంబీకులు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరం, సైదాబాద్ లోని ఓ ఆర్యసమాజ్ లో ఓ ప్రేమజంట వివాహం చేసుకునేందుకు సిద్ధపడింది. కాసేపట్లో ఆ యువతీయువకుల వివాహం ముగుస్తుందనగా.. అక్కడికి యువతి కుటుంబసభ్యులు చేరుకున్నారు. అంతే.. ప్రియుడ్ని బాగా చితకబాది, యువతిని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. యువతి రానంటూ ఎంతగా పెనుగులాడినా.. కుటుంబసభ్యులు ఆమెకీ రెండు తగిలించి ఓ బైకులో తీసుకెళ్లారు. దీంతో సైదాబాద్ లో కొద్దిసేపటివరకు గందరగోళం పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా యువతి కుటుంబీకులు గుంపుగా వచ్చి యువకుడిపై దాడి చేయడంతో అక్కడి స్థానికులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు యువకులు తమ మొబైల్ లో వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోల్లో ముఖ్యంగా అమ్మాయిని తీసుకువెళ్తున్న వైనమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు.. ఈ మొత్తం తతంగాన్ని చిత్రీకరించిన మీడియా వారిని కూడా యువతి బంధువులు దుర్భాషలాడడం జరిగింది. ఏదేమైనా.. ఈ ప్రేమవ్యవహారం మరిన్ని వివాదాలకు దారి తీస్తుందోనని అంతా భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more