Telangana | Digital telangana | Digital india | KTR | internet

Telangana govt decided to provide internet connection to every home in the state

Telangana, Digital telangana, Digital india, KTR, internet

Telangana govt decided to provide internet connection to every home in the state. Telangana govt moving to digitalisation by the inspiration of digital india.

డిజిటల్ తెలంగాణ.. ఇంటింటికి నెట్ కనెక్షన్

Posted: 06/30/2015 08:02 AM IST
Telangana govt decided to provide internet connection to every home in the state

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. జులై 1 నుంచి రాష్ట్రంలో 'డిజిటల్‌ తెలంగాణ' కార్య క్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జులై 1 నుంచి 6 వరకు వివిధ కార్య క్రమాలను నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈమేరకు కార్యాచరణను ప్రకటించింది.వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి నీటిని అందించినట్టుగానే.. ప్రతీ ఇంటికి ఓఎఫ్‌సీ ద్వారా ఇంటర్నెట్‌(4జీ) సేవలను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వైఫై సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ పంచాయతీ పథకం ద్వారా పలు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానుంది. ప్రతీ ఇంటిలో కంప్యూటర్‌పై అవగాహన ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఆరో తరగతి పైబడిన విద్యార్థులందరికీ కంప్యూటర్‌ బేసిక్స్‌ను వివరించాలని యోచిస్తోంది. అదేవిధంగా మీ సేవను మరింత విస్తరించనున్నారు. మొబైల్‌ ఫోన్ల కు కూడా మీ సేవలను విస్తరించనున్నారు. ఇందు కోసం నాస్కామ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వారం రోజుల కార్యాచరణలో భాగంగా జులై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్‌కీ బాత్‌ కార్యక్రమ ప్రసారం, 2న గ్రామస్థాయిలో అవగా#హన కార్యక్రమాలు, 3న డివిజనల్‌, జిల్లాస్థాయిలో డిజిటల్‌ తెలంగాణపై అవగాహన, 4న జిల్లాస్థాయిలో స్కూళ్లు, కళాశాలల్లో డిజిటల్‌ తెలంగాణపై పోటీలు, చర్చల నిర్వహణ, 5న #హదరాబాద్‌లో 5కే రన్‌, డిజిటల్‌ రాహ్‌గిరి, 6న రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ డిజిటల్‌ ఇండియా, అవార్డుల ప్రదానం, ఒప్పందాలపై సంతకాలు తదితర కార్యక్రమాలను నిర్వ#హంచనున్నారు.కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా జూలై 1న డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Digital telangana  Digital india  KTR  internet  

Other Articles