ఉమ్మడి ఏపి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుకు భలే కష్టం వచ్చింది. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపొయిన తర్వాత అటు ఏపికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికల కాగా, తెలంగాణ సిఎంగా కేసీఆర్ ఎన్నికయ్యారు. అయితే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేశారు. కానీ ఉమ్మడి రాజధాని పరిధి ఉన్నంత వరకు రెండు రాష్ట్రాలకు హక్కులుంటాయి.. హైదరాబాద్ పరిథి దాటితే మాత్రం తెలంగాణ సర్కార్ కిందకు వస్తుంది. అయితే హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కనీసం స్వాగతం కూడా పలుకలేనంత కష్టం వచ్చింది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి కూడా రాలేనంతలా చంద్రబాబు ఏ: చేస్తున్నారు అనే డౌట్ అక్కర్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు బిజీ వల్ల రాకపోవడం కాదు.. వచ్చేందుకు వీలులేకపోవడం.
తెలుగురాష్ర్టాలు రెండుగా ఏర్పడిన తర్వాత గత అక్టోబరులో తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ర్టపతి ప్రణబ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఎయిర్‌పోర్టుకి వెళ్లి స్వాగతం పలికారు. రెండోసారిగా 10రోజుల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ర్టపతికి స్వాగతం పలకడానికి గవర్నర్, తెలంగాణ సీఎం మాత్రమే హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మిస్సయ్యారంటూ అప్పుడే ఆరా తీయడం మొదలైపోయింది. ఇద్దరు చంద్రుల మధ్య తాజాగా నెలకొన్న విభేదాల కారణంగానే చంద్రబాబు ఎయిర్‌పోర్టుకి వెళ్లలేదని నాయకులు సైతం చర్చించుకున్నారు. ఐతే, రాష్ర్టపతి విమానం దిగిన హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్ కామన్ కేపిటల్ పరిధిలో లేకపోవడం వల్లే చంద్రబాబు హాజరు ప్రోటోకాల్‌లో లేదని, అందువల్లే ఆయనకు ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. ఈ క్రమంలో రాష్ర్టపతిని ఆహ్వానించే ఛాన్స్ చంద్రబాబుకు మిస్సయ్యింది. ఇక్కడ మిస్సయినా జులై 1న తిరుమలకు వెళ్లనున్న రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీని చంద్రబాబు ఆహ్వానిస్తారని అంటున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more