Revanth reddy, bail, cash for vote, high court

Revanth reddy got bail

Revanth reddy, bail, cash for vote, high court

Revanth Reddy got bail. A1 accused in cash for vote case, Revanth Reddy got bail on tuesday.

ITEMVIDEOS: రేవంత్ రెడ్డికి బెయిల్

Posted: 06/30/2015 11:07 AM IST
Revanth reddy got bail

ఓటుకు నోటు వ్యవహారంలో ఏ1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఐదు లక్షల పూచీకత్తుతో బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్ట్ తీర్పు వెల్లడించింది. రేవంత్ రెడ్డితో పాటుగా సెబాస్టియన్, ఉదయసింహాలకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. అయితే హైదరాబాద్ , కొడంగల్ లలో మాత్రమే పర్యటించాలని ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదని హైకోర్టు ఆర్డర్ వేసింది. అయితే రేవంత్ రెడ్డి పాస్ పోర్ట్ ను కోర్టులో సరెండర్ చెయ్యాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఏసీబీ, తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి చేసిన వాదనలు కోర్టులో నిలువలేదు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికి మూడు సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కానీ పూర్తి స్థాయి బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్ట్ తీర్పు నిచ్చింది. అయితే గతంలో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థ సమయంలో కేవలం పన్నెండు గంటల బెయిల్ ను మాత్రమే మంజూరు చేసింది.

 

 

ఓటుకు నోటు కేసులో ఏసీబీ తరఫున తెలంగాణ అడ్వకేట్ జనరల్ తన వాదనను వినిపించారు. ఈ కేసులో సాక్షాధారాలు పక్కాగా ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దు అన్న వాదనను హైకోర్ట్ తోసిపుచ్చింది. అయితే రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు గతంలో అరెస్టు సమయంలోనే రేవంత్ రెడ్డిని  పూర్తిస్థాయిలో విచారించారని, కొత్తగా సమాచారం చెప్పడానికి ఏమీ లేదని, అలాగే విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వాలని వాదించారు. అయితే అడ్వకేట్ జనరల్ వాదిస్తు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం ముత్తయ్య కోర్టులను అడ్డంపెట్టుకొని తప్పించుకు తిరుగుతున్నారని, కేసు కీలక దశకు చేరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే కేసు మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వాదించారు. పట్టుబడిన యాభై లక్షల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని కూడా ఏజి వాదించారు.

అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుగువిశేష్ గతంలోనే ఓ ఆర్టికల్ రాసింది. తెలుగు విశేష్ ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తాజాగా తీర్పునివ్వడం గమనార్హం.
మరింత చదవండి.... రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  bail  cash for vote  high court  

Other Articles