తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎట్టకేలకు ట్విట్టర్ పిట్ట.. నేరుగా మీడియాతో కూసింది. ఈ వ్యవహరాలపై సుమారు నెల రోజుల తరువాత స్పందించిన టీడీపీ యువనేత నారా లోకేష్ పలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదీ తెగే వరకు లాగకూడదన్నారు. నోటుకు ఓటు కేసులో నోటీసులు ఇచ్చినంత మాత్రాన బ్రహ్మాండం బద్దలై పోదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. అందితే జట్టు అందకపోతే కాళ్లు అనేది కెసిఆర్ తత్త్వమని ఆయన దుయ్యబట్టారు.ఫోన్‌ట్యాపింగ్ భయం లేకుంటే హోంశాఖ కార్యదర్శిని టీ సర్కార్ ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. అంతేకాకుండా కేసును డీల్ చేస్తున్న ఇంటెలిజన్స్ చీఫ్ దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు అని లోకేష్ ప్రశ్నించారు.
టీ సర్కార్ నోటీస్‌లు ఇస్తే తమ నెత్తిన పాలు పోసినట్లేనని ఆయన అన్నారు. నోటీసులు ఇవ్వాలనే మేం కూడా కోరుకుంటున్నామని చెప్పారు. గవర్నర్ రాష్ట్రపతికి ఇచ్చే విందుకు కేసీఆర్ గైర్హాజరు కావండంపై స్పందిస్తూ.. చంద్రబాబుకు ఎదురు పడలేకనే గవర్నర్ విందుకు కేసీఆర్ గైర్హాజరయ్యారని విమర్శించారు. నాలుగు రోజులు ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడే జ్వరం వచ్చిందా అని ప్రశ్నించారు.రూ. వేల కోట్ల టర్నోవర్ ఉన్న హెరిటేజ్‌ను హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టేందుకు టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్‌దని ఆరోపించారు. కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని నారా లోకేష్ అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more