digvijay singh fires on d srinivas | trs party | telangana state | congress party leaders

Digvijay singh fires d srinivas resignation trs party telangana state

digvijay singh, digvijay singh news, d srinivas, congress senior leader d srinivas, telangana state, trs party, trs party leaders, congress party, congress news, digvijay singh updates, digvijay singh controversy

digvijay singh fires d srinivas resignation trs party telangana state : aicc chief secretary digvijay singh fires on senior leader d srinivas for resigning party and join in trs.

ఏమయ్యా.. దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంటి?

Posted: 07/02/2015 10:44 AM IST
Digvijay singh fires d srinivas resignation trs party telangana state

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కి కోపమొచ్చింది. తనమీద ఎన్ని వివాదాలొచ్చినా మౌనంగా వుంటూ కూల్ గా సమాధానాలిచ్చిన ఈయన.. ఇప్పుడు చాలా గరంగరంగా వున్నారు. ఎందుకంటే.. నిన్నటివరకు ఆ పార్టీ ఇచ్చిన హోదాలను అనుభవిస్తూ దానికి అనుకూలంగా డప్పు వాయించిన నేతలు క్రమంగా ఇతర పార్టీల్లో జంప్ అవుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు అటు టీపీడీ, ఇటు తెరాసలో జంప్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతలకు గట్టి షాక్ తగిలేలా చేసింది. ఈ క్రమంలోనే డిగ్గీరాజు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు.

డి.శ్రీనివాస్ రాజీనామా నిర్ణయంపై స్పందించిన డిగ్గీరాజా.. ‘ఏమయ్యా.. ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంటి?’ అన్న రీతిలో మాట్లాడారు. గతంలో ఆయన ఎన్నికల్లో ఎన్నోసార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన సీనియారిటీని చూసి తాము పదవులిచ్చి గౌరవించామని దిగ్విజయ్ పేర్కొన్నారు. పార్టీ ఆయనకు సముచితంగానే సత్కరించిందని.. అంతకంటే ఇంకేం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించామని, ఈ దఫా మహిళలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించిన ఆకుల లలితనే ఎంపిక చేశామని డిగ్గీరాజా గుర్తు చేశారు. సీనియర్లు కేవలం అవకాశవాదంతో పార్టీని వీడుతున్నారని, శ్రీనివాస్ రాజీనామా తమను బాధ కల్పించిందని దిగ్విజయ్ అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digvijay singh  d srinivas  trs party  

Other Articles