అమెరికాలో తెలుగు వారి కీర్తి పతాకం ఎగురుతోంది. అక్కడ ఉంటున్న తెలుగు సంఘం తానా మహాసభల ఆరంభం ఎంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభలు డెట్రాయిట్ నగరంలోని కోబో హాల్ లో ఎంతో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. సినీ, రాజకీయ, కళా, వ్యాపార రంగాల ప్రముఖుల హాజరుతో సందడిగా మారింది. మూడురోజుల ఈ పండుగకు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాధరెడ్డి, పరిటాల సునీత, వేమూరి రాధాకృష్ణ, సినీ ప్రముఖులు వెంకటేష్, సురేష్ బాబు, తాప్సీ, దర్శకుడు రాఘవేంద్రరావు, నవదీప్, అల్లరి నరేష్, నిఖిల్, పరుచూరి, సుద్దాల అశోక్‌తేజ, గోరటి, గుమ్మడి గోపా లకృష్ణ, జొన్నవిత్తుల, ధర్మవరం ఎమ్మెల్యే సురేష్, క్రాంతి మాధవ్, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తోట నర్సింహులు, డాక్టర్ కోడెల శివరాం, పితాని సత్యనారాయణ, యలమంచిలి శివాజీ, అట్లూరి సుబ్బా రావు తదితరులు ఈ ప్రారంభ విందులో పాల్గొన్నారు.
Also Read: Dance practices for TANA Celebrations in Detroit -USA
తానా సమావేశాల విందు కార్యక్రమంలో.. వివిధ రంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తున్న విషయాన్ని తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ గుర్తుచేశారు. వేలాదిమంది కార్యకర్తలు, ఎందరో దాతలు ఈ సభల నిర్వహణకు తమ సమయాన్ని, కష్టాన్ని వెచ్చించారని తానా 20వ మహాసభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్ అన్నారు. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ పురస్కారాన్ని సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. నందమూరి రామాయణం పేరిట ఆయన చెప్పిన పద్యపాదం అందరినీ ఆకట్టుకుంది. ఇక.. ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్నవారి వివరాలు.. రవ్వా శ్రీహరి, సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ పొదిలి ప్రసాద్, గుత్తికొండ రవీంద్రనాధ్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, డాక్టర్ ప్రసాద్ కాకరాల, డాక్టర్ గంగా చౌదరి, డాక్టర్ వల్లూరిపల్లి శివాజీ రావులకు పురస్కారాలను అందించారు.
Also Read: అమెరికాలో తెలుగు వారి సంబరాలు
తానా మహాసభలతో నాటుగా అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో లాస్‌ఏంజిలిస్‌లో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. . వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేశారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు , హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, తెలంగాణ ప్రతిపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజా, అమెరికాలో ప్రముఖ వైద్యుడు డా. ఎల్.ప్రేమసాగర్ రెడ్డి తదితరులు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో సినీనటులు సాయికుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్ ఉన్నారు. వీరితో పాటు అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న కె.ఉమారాజేశ్వరి, కిరణ్‌ప్రభ, రాజురెడ్డి, రమేష్, పి.పి.రెడ్డి, గంగాధర్ దేసు, గుత్తికొండ శ్రీనివాస్, లకిరెడ్డి హనిమిరెడ్డి, గ్రీట్ వే రమేశ్, రవీంద్ర మాదాల, సాయికృష్ణ దావులూరి, సాయికుమార్, శ్వేత రావు, వంశీ రామరాజు, రాజమౌళి, వై.వి.నాగేశ్వరరావు తది తరులకు అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలను కూచిబొట్ల ఆనంద్ పరిచయం చేశారు. సినీ నటులు తనికెళ్ల భరణి, అలీ, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, కమలినీ ముఖర్జీ, మీనాక్షి దీక్షిత్, మనీషా రాథోడ్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా 44 రకాల నోరూరించే వంటకాల విందు కార్యక్రమం పసందుగా జరిగింది
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more