అతి నిత్యం రావణకాష్టంలా బాంబుదాడులలు, ముష్కర కాల్పులతో దద్దరిల్లే రాష్ట్రం జమ్మూకాశ్మీర్. సరిహద్దు ప్రాంతాలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆర్మీ జవాన్లు, జమ్మూ పోలీసులతో పాటు.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు అనేకులు ఈ రాష్ట్రంలో అనునిత్యం, అహర్నిషలు విధులు నిర్వహిస్తూనే వుంటారు. ఎక్కడ అలికిడి అయినా.. అక్కడికి క్షణాల్లో వాలిపోతుంటారు. అలాంటి కట్టుదిట్టమై భద్రత వున్న రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ కరువైంది. ఈ రాష్ట్రంలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా మగమృగాళ్లు పైచాశికత్వంతో మహిళపై దుశ్యాసన పర్యానికి తెరలేపారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉదంపూర్ జిల్లా జగనూ ప్రాంతంలో బైక్ పై వస్తున్న యువతీ యువకుడిని ఐదుగురు వ్యక్తులు అడ్డగించారు. యువతితో అసభ్యపదజాలంతో మాట్లాడారు. అంతటితో ఆగకుండా పట్టపగలు.. నట్టనడిబజారులో అందరూ చూస్తుండగానే ఓ యువతిని వివస్త్రను చేసి.. ఆ ఘటనను సెల్ ఫోన్ లో బంధించి సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేశారు. నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా వున్నడని సమాచారం. వాట్సాప్ లోనూ ఈ వీడియోను నిందితులు షేర్ చేశారు.
పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఉదంపూర్ పోలీస్ కమీషనర్ తెలిపారు. బాధితురాలు వేరే వ్యక్తితో కలసి మోటార్ బైక్ పై వెళ్తున్నప్పుడు అసభ్యంగా వ్యవహరించడమే కాక.. పోకిరీలను ప్రతిఘటించినందుకు..అమెను వివస్త్రను చేసి అత్యంత దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ఈ దర్శచర్యను చూసినా ఎవరు స్పందిచకపోవడం దారుణమైన విషయమని, కనీసం తమకు కూడా ఘటనపై సమాచారం అందించలేదని చెప్ాపు. దీంతో తామే ఈ ఘటనపై సుమోటాగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more