Trees | Nizamabad | TRS | Colour | KCR | DS | velpur

The trees got trs party colour in the velpur village of nizamabad

Trees, Nizamabad, TRS, Colour, KCR, DS, velpur

The Trees got TRS party colour in the Velpur village of Nizamabad. Telangana cm KCR attending the harithaharam programmee in the Nizamabad soon.

ఆ చెట్లు టిఆర్ఎస్ పార్టీలోకి చేరాయా..?

Posted: 07/06/2015 01:37 PM IST
The trees got trs party colour in the velpur village of nizamabad

ప్రభుత్వాలు మారిన ప్రతి సారి రేషన్ కార్డుల మీద, బస్సుల మీద కలర్లు మారతాయి. ఇది అందరికి తెలుసు. ఏ ప్రభుత్వం వస్తే ఆ రంగు పడుద్ది. అయితే ఏదైనా పార్టీ కార్యక్రమం ఉంది అంటే ఆ చుట్టు పక్కల మొత్తం ఆ పార్టీ జెండాలు ప్రత్యక్షమవుతాయి. అయితే చుట్టుపక్కల జెండాలు కట్టడాన్ని పార్టీ ప్రతిష్టగా కూడా అనుకునే వారున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ కార్డులకు, బస్సులకు రంగులు వేసిన ఘటనలపై వార్తలు వినే ఉంటారు. కానీ ఎన్నడైనా, ఎక్కడైనా చెట్లకు రంగులు వెయ్యడం గురించి విన్నారా..? అంటే పలినా పార్టీ కార్యక్రమం ఉంది అంటే ఆ చుట్టుపక్కలున్న చెట్లకు పార్టీ రంగులు వెయ్యడం అన్నట్లు. ఏంటీ ..? ఇలా కూడా ఉంటుందా..? అని అనుకోకండి. ఉంటుంది. పైత్యం ఎక్కువైతే ఎన్ని వింతలైనా జరుగుతాయి. తాజాగా కొన్ని చెట్లు టిఆర్ఎస్ పార్టీ రంగును పులుముకున్నాయి.

Also read :  కోతులు కలిసి విప్లవం జిందాబాద్ అన్నయంట..!

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. అయితే వేల్పూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న చెట్లు తాజాగా టిఆర్ఎస్ రంగు పులుముకున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి మద్దతు అన్నట్లుగా చెట్లకు గులాబీ రంగు వెయ్యడం వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే నిజామాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డిఎస్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దానికి అంతా సిద్దమైంది. అయితే డిఎస్ సొంత గ్రామమైన వేల్పూర్లో  ఏకంగా చెట్లకు కూడా గులాబీ రంగు వెయ్యడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు కూడా భలేగా స్పందిస్తున్నారు. ఇంకా నయం ఊర్లోని వారందరి మొహాలకు గులాబీ రంగు పుయ్యలేదు అని కామెంట్ లు కూడా వస్తున్నాయి. మొత్తానికి పైత్యం పలు రకాలు అందులో ఇది కూడా ఒకటి అని కొంత మంది అనుకుంటున్నారు.

Also read:  కేసీఆర్ ను పరామర్శించా.. అంతే.. అంతకుమించి ఏమీలేదు..

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trees  Nizamabad  TRS  Colour  KCR  DS  velpur  

Other Articles