Janasena | pawan Kalyan | pawan Kalyan as political leader | Pawan kalyan updates | Pawan kalyan tweets

Pawan kalyan becoming full time politician

Janasena, pawan Kalyan, pawan Kalyan as political leader, Pawan kalyan updates, Pawan kalyan tweets

Pawan kalyan becoming full time politician.Pawan Kalyan plans to ground work on his party janasena.

ఫుల్ టైం పాలిటిక్స్ లోకి పవన్ కళ్యాణ్

Posted: 07/09/2015 03:24 PM IST
Pawan kalyan becoming full time politician

జనసేన పార్టీ.. దేశంలో రోజకో పార్టీ పుట్టుకు వస్తున్నట్లు వచ్చిన పార్టీల్లో ఇది కూడా ఒకటి. కానీ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ కారణంగా ప్రారంభం నుండే వార్తల్లో సెన్సేషన్  నిలిచింది. అయితే ఏవో కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోతున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు తెర తీసిన సెక్షన్ 8, ఓటుకు నోటు, ట్యాపింగ్ వ్యవహారం మీద స్పందించారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలతో మామూలు జనం ఆలోచనలో పడితే రాజకీయ నాయకుల్లో మాత్రం అలజడి ప్రారంభమైంది. ఏపి ఎంపీలను ప్రశ్నించిన పవన్ , స్పందించిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also read:  అప్పుడు ఎక్కడికెళ్లారు అని ప్రశ్నించిన పవన్.. మరోసారి ఏపీ ఎంపీలను నిలదీశారు

జనసేన పార్టీ పెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న సంక్షోభ పరిస్థితులు, విసుగు తెప్పిస్తున్న ప్రజాసమస్యల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్ తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు పవన్ ను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారుతున్నారు. అందులో భాగంగా పవన్ గ్రౌండ్ లెవల్ లో పని స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తరువాత ఎపి, తెలంగాణా ప్రాంతాల్లో ఆయన పై ఇరు ప్రాంత అధికార పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురుదాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మీడియాలో తమ వాదన విన్పించేందుకు జనసేన పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఆంధ్రా తెలంగాణలకు చెందిన నలుగురిని తమ సమన్వయకర్తలగా పేర్కొంటూ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. సమన్వయకర్తలగా నియమింపబడ్డవారిలో బింగునూరి మహేందర్ రెడ్డి, రియాజ్, నర్సింహా, శంకర్ గౌడ్ లు ఉన్నారు.

Also Read: మీ పౌరుషం ప్రత్యేకహదా తేవడంపై చూపండి.. నాపై కాదు: పవన్
 
సమన్వయకర్తల్లో కూడా సామాజిక సమీకరణలు, ప్రాంతాలను కూడా పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బిసి, మైనార్టీ, ఓసీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని నియమించడంతో పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతోంది. వీరంతా మీడియాలో జనసేన వాయిస్ విన్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కనిపించకుండానే అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ఎన్నికల సమయంలో టిడిపితో జతకట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారని అనుకున్న వారికి గట్టి ఝలక్ తగిలింది. తప్పు చూస్తే ఎవరినైనా వదిలేదని పవన్ తీరును చూస్తే అర్థమవుతోంది. మరి తొందరలోనే ఫుల్ టైం పొలిటీషియన్ గా మారి తప్పులు చేస్తున్న వారిని ఏకిపారెయ్యడానికి పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారు.

By Abhinavachary

Also Read:  పవన్ ను ప్రశ్నించే వాళ్లు ముందు వీటికి జవాబు చెప్పండి
Also Read:  తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles