Sandra venkataveeriah | Telangana | ACB | Cash for vote | revanth Reddy, Sebastian, Jimmi, stephenson

Telangana acb officers interrogate sandra venkata veeriah but sandra did say any detail

Sandra, Sandra venkataveeriah, Telangana, ACB, Cash for vote, revanth Reddy, Sebastian, Jimmi, stephenson

Telangana ACB officers interrogate Sandra venkata veeriah but sandra did say any detail. In the cash for vote case telangan acb arrested sandra and investigating.

సండ్ర ఏమీ చెప్పలేదా.? విచారించిన తెలంగాణ ఏసీబీకి షాక్..?!

Posted: 07/10/2015 08:29 AM IST
Telangana acb officers interrogate sandra venkata veeriah but sandra did say any detail

ఓటుకు నోటు వ్యవహారంలో నిందితుడిగా అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో జనార్దన్ ఎవరు..? బాస్ ఎవరు..? సెబాస్టియన్ తో ఏం మాట్లాడారు..? జిమ్మి గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ముఖ్యంగా సెబాస్టియన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణ, డబ్బులపైనే అధికారులు ఎక్కువ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రతిరోజు ఎంతోమంది ఫోన్‌ చేస్తుంటారని, వారిలో చాలామందిని ప్రత్యక్షంగా చూస్తేగానీ గుర్తుపట్టలేనని సండ్ర వివరించారు.

Also Read:  చేసింది మొత్తం సండ్రనే.. ఇవిగో ఫోన్ సంభాషణలు

పార్టీలో సహచరులకు ఫోన్‌ చేయడం, వారు తనకు ఫోన్‌ చేయడం సహజమేనని... ఫోన్‌ సంభాషణలకు, తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేదని తెలిపారు. ‘తొలుత సెక్షన్‌ 160 ప్రకారం నోటీసులు జారీ చేసినప్పుడు ఎందుకు విచారణకు రాలేదు?’ అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అనారోగ్యం వల్లే రాలేకపోయానని సండ్ర బదులిచ్చారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తెచ్చిన రూ. 50 లక్షలు, ఓటింగ్‌ తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రూ.4.5 కోట్ల విషయమై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే... ఆ విషయాలేవీ తనకు తెలియదని సండ్ర స్పష్టం చేసినట్లు సమాచారం.

Also Read:  ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు

తాను ఎమ్మెల్యేనని. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడినని. తనకు ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అందులో సగంమందిని చూస్తేగానీ గుర్తుపట్టలేని పరిస్థితి అని సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.  ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ నేతృత్వంలో డీఎస్పీ, ఇతర అధికారులు సండ్రను ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేం నరేందర్‌ నుంచి సేకరించిన సమాచారం, ఫఓరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నల మీద ఆరా తీశారు.

Also Read:  సండ్రకు 14 రోజుల రిమాండ్.. రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ

ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తొలిరోజు కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి... రాత్రి బస నిమిత్తం సిట్‌ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సండ్ర ఎక్కడా తడబడకుండా సమాధానాలిచ్చారని, కాగా వెన్ను నొప్పితో బాదపడుతున్నందున కొంత ఇబ్బందికి గురయ్యారని సండ్ర తరఫు లాయరు సుధీర్ తెలిపారు. నిజంగా సండ్ర ఎలాంటి వివరాలు వెల్లడించలేదా..? లేదా సండ్ర లాయరు అలా అంటున్నాడో తెలియదు. కాగా అంతకుముందు సండ్రకు ఏపి ఏసీబీ ట్రెయినింగ్ ఇచ్చింది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏసీబీ విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే అనుమానాలు మరింత బలపడతాయి.

By Abhinavachary

 

Also Read:  సండ్రకు బెయిల్ వచ్చేనో ..? లేదో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandra  Sandra venkataveeriah  Telangana  ACB  Cash for vote  revanth Reddy  Sebastian  Jimmi  stephenson  

Other Articles