జపాన్ పర్యటనను ముగించుకుని గత రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో సీఎం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి అటవీభూములు ఇవ్వాలని కోరామని సీఎం చంద్రబాబు తెలిపారు. డీనోటిఫై చేసి చట్టపరమైన అడ్డంకులు తొలిగించాలని కోరామని ఇందుకు జవదేకర్ సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు చెప్పారు.
41 అటడీ బ్లాకులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డీ నోటిపై చేయమని కోరారని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. అవసరమైన అన్ని బ్లాకులను డీ నోటిపై చేసేందుకు కేంద్రం సిద్దంగా వుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్దంగా వుందని చెప్పారు. త్వరితగతిన అన్ని అనుమతులు ఇస్తామన్నారు. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రకాష్‌జవదేకర్ స్పష్టం చేశారు.
అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా విద్యుత్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన 1,253 మంది విద్యుత్ ఉద్యోగులను టి.సర్కార్ రివీల్ చేసిందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని గోయల్‌ను కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో సుమార్ 4000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి విధివిధానాలపై చర్చించినట్లు సమాచారం.
ఆ తరువాత ప్రస్తుతం కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారురు. సెక్షన్-8పైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల విడుదలలో జాప్యంపై చర్చించే అవకాశం ఉంది. ఈనెల 14 నుంచి జరుగనున్న గోదావరి పుష్కరాలకు ఉమాభారతిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భేటీపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more