Modi, Sharif discuss Lakhvi and trade at hour-long bilateral talks

Modi accepts nawaz s invite for first pakistan visit

Modi, Sharif discuss Lakhvi and trade at hour-long bilateral talks, Modi-Sharif talks, Modi-Nawaz Sharif talks, India-Pakistan talks, PM Narendra Modi, Nawaz Sharif, Pakistan, SCO, Modi Russia visit, Modi-Nawaz talks, Modi-Sharif meet, Prime Minister, Narendra Modi, Nawaz Sharif, Russia, Ufa

Indian Prime Minister Narendra Modi held bilateral talks with his Pakistani counterpart Nawaz Sharif in a rare meeting in Russia's Ufa on Friday.

దాయాధి ప్రధానుల రష్యన్ షేకహ్యాండ్.. ఉగ్రవాదం.. దైపాక్షికాలపై చర్చలు

Posted: 07/10/2015 04:39 PM IST
Modi accepts nawaz s invite for first pakistan visit

భారత్ పాకిస్థాన్ లతో పాటుగా యావత్ ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న దాయాది దేశాల ప్రధానమంత్రులు భేటీ ముగిసింది. సుమారుగా 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ ప్రధానులు ఇద్దరూ ఉగ్రవాదంపై పోరు అంశంమై చర్చించారు. రష్యాలోని ఉఫాలో జరిగిన ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదంపై పోరుకు తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. ముంబాయి పేలుళ్ల సూత్రధారులపై చర్యలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని భారత్‌ ఆరోపించింది. ముంబై ఉగ్రదాడి ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లఖ్వీ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న వ్యవహారాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వద్ద ప్రస్తావించారు. లఖ్వీ అంశానికి సంబంధించి మరిన్ని సాక్షాలను పాక్ కు అప్పగించేందుకు భారత్ అంగీకారాన్ని తెలిపింది.

పాకిస్తాన్‌ సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని మోదీ గుర్తు చేశారు. గురువారం రాత్రి కూడా పాక్‌ సైనికుల కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ చనిపోయిన తర్వాత మృతుల వివరాలను కూడా పాక్‌కు అందించినట్లు సమాచారం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా పాక్‌, చైనా ఆర్థిక కారిడార్‌పై మోదీ అభ్యంతరం చెప్పగా దానికి ఇంకా సమయం ఉందని షరీఫ్‌ సమాధానం ఇచ్చారు. పాక్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వెనుక భారత్‌ హస్తముందన్న షరీఫ్‌ ఆరోపణను మోదీ తోసిపుచ్చారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని మోదీ డిమాండ్‌ చేశారు.

ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి కృషి చేయాలని మోదీ, షరీఫ్‌ నిర్ణయించారు. దైపాక్షిక సంబంధాలపై చర్చించడానికి రెండు దేశాలు అంగీకానికి వచ్చినట్లుగా ఇరు ప్రధానులు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని అంవాలపై చర్చించడానికి రెండు దేశాల రక్షణ సలహాదారులు త్వరలో న్యూఢిల్లీో సమావేశం కానున్నారని వెల్లడించారు. షరీఫ్‌ ఆహ్వానం మేరకు మోదీ షార్క్‌ సదస్సుకు వెళుతున్నారు. 2016లో సార్క్‌ సదస్సు పాకిస్తాన్‌లో జరుగుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi-Sharif meet  Prime Minister  Narendra Modi  Nawaz Sharif  Russia  Ufa  

Other Articles