Memon | Yakub Memon | Supreme court | curative petition, Mumbai, Mumbai serial blasts

Mumbai serial blasts convict yakub memon to be hanged as supreme court dismisses his curative petition

Memon, Yakub Memon, Supreme court, curative petition, Mumbai, Mumbai serial blasts

Mumbai serial blasts convict Yakub Memon to be hanged as Supreme Court dismisses his curative petition The Supreme Court on Tuesday dismissed 1993 Mumbai serial blasts convict Yakub Memon's curative petition against death sentence. Memon will now be hanged on July 30 . The curative petition was the last legal recourse available for Memon. The hanging is likely to take place at Nagpur Central Jail.

మెమెన్ కు ఉరి శిక్ష ఖరారు

Posted: 07/21/2015 04:10 PM IST
Mumbai serial blasts convict yakub memon to be hanged as supreme court dismisses his curative petition

ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్ ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఒక్కగానొక్క ఆశ కూడా ఆవిరి అయింది. యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ యాకుబ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 30నే యాకుబ్ కు ఉరిశిక్ష అమలు చేయనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు నాగపూర్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోగా 1200 పైగా గాయపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ఈ ఘటన అత్యంత విశాదకరమైంది. దీనికి కారణమైన యాకుబ్ మెమన్ కు టాడా కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జూలై 30న నాగపూర్ జైలు లో యాకుబ్ ను ఉరి తీయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలు లో యాకుబ్ శిక్ష అనుభవిస్తున్నాడు.

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మెమెన్ ఉరి శిక్షకు ముందు రాజీవ్ గాంధీని ఉరి తీసిన వారిని ముందు ఉరి తీయాలని తర్వాత మెమెన్ వ్యవహారం చూడాలని డిమాండ్ చెయ్యడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఆనందం వ్యక్తం చేశారు. బాధితుల తరఫున మెమెన్ కు తగిన శిక్షను విధించినట్లు భావిస్తున్నానని అన్నారు. ఇక రిటైడ్ జడ్జ్ పిడి కోడె భారతదేశంలో న్యాయస్థానాల మీద మరింత నమ్మకం కలిగేలా తీర్పు వెలువడిందని అన్నారు. మొత్తానికి టాడా కోర్ట్ గతంలోనే ఉరి శిక్ష విధించినా.. క్షమాభిక్ష పిటిషన్ తో కొంత కాలంగా తప్పించుకున్నారు. కానీ తాజాగా కోర్ట్ తీర్పు మెమెన్ కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Memon  Yakub Memon  Supreme court  curative petition  Mumbai  Mumbai serial blasts  

Other Articles