Supreme Court agrees to hear petition challenging bail of Salman Khan hit and run case | Bollywood

Supreme court agrees to hear petition challenging bail of salman khan hit and run case

salman khan, hit and run case, salman khan bail, supreme court, supreme court salman khan, salman khan controversy, bajrangi bhaijan news, salman latest updates, hit and run controversy, salman hit and run case

Supreme Court agrees to hear petition challenging bail of Salman Khan hit and run case : The Supreme Court has agreed to hear a petition challenging bail given to actor Salman Khan's in the 2002 hit-and-run case till July 20.

‘హిట్ అండ్ రన్’ కేసుపై పిటిషన్.. చిక్కుల్లో సల్మాన్!

Posted: 07/21/2015 05:17 PM IST
Supreme court agrees to hear petition challenging bail of salman khan hit and run case

చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన ‘హిట్ అండ్ రన్’ కేసును బాంబే హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే! 2002 సెప్టెంబర్ 28వ తేదీన సల్మాన్ ఖాన్ తప్పతాగి దూకుడుగా కారు నడిపాడు. తాగిన మైకంలో వున్న సల్మాన్ కారును అదుపు చేయలేక బేకరీలోకి దూసుకెళ్లాడు. దీంతో బేకరీ బయట పేవ్ మెంట్ నిద్రిస్తున్న వారిలో ఒకరు చనిపోగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షి అయిన సల్మాన్ బాడీగార్డ్ కొద్దికాలానికి మరణించగా.. మరో వ్యక్తి అసలు కనిపించకుండాపోయాడు. పెద్ద సంచలనం సృష్టించిన ఈ కేసు కొన్ని సంవత్సరాలపాటు నడిచింది.

చివరగా రెండు నెలల కిందట ముంబై సెషన్స్ కోర్టు కేసు విచారణను ముగించి.. సల్మాన్ కు ఐదేళ్లపాటు జైలు శిక్ష కూడా విధించింది. దీంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సల్మాన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. రెండు రోజులు గడిచాయో లేదో.. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసి.. సల్మాన్ కి బెయిల్ మంజూరు చేసేసింది. దీంతో మళ్లీ బాలీవుడ్ లో సంతోష వాతావరణం అలుముకుంది. సంబరాలు అంబరాన్నంటేలా అభిమానులు ఆ రోజును సంతోషంగా జరుపుకున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ కేసుపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ తో సల్మాన్ మళ్లీ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ కేసులో ఎలా బెయిల్ మంజూరు చేస్తారోనంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఆ కేసును బదిలీ చేయాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. అతని పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వచ్చే వారంలో కోర్టు ఏం తీర్పు వెల్లడిస్తుందో వేచి చూడాల్సిందే! సల్మాన్ బెయిల్ పై ఇలా పిటిషన్ దాఖలు కావడంపై సంచలన వాతావరణం నెలకొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  supreme court  hit and run case  

Other Articles