Chandrababu Govt Takes important decisions on capital city in latest cabinet meeting | godavari pushkaralu

Ap cabinet meeting important decisions on capital city pushkaralu

ap cabinet meeting, chandrababu naidu, babu govt, chandrababu latest news, ap capital city, amaravathi, amaravathi latest images, ap capital amaravathi news, ap cabinet news, godavari pushkaralu

Ap cabinet meeting important decisions on capital city pushkaralu : Chandrababu Govt Takes important decisions on capital city, godavari pushkaralu and many other problems in latest cabinet meeting.

ఏపీ క్యాబినెట్ లో ‘రాజధాని’పై కీలక నిర్ణయాలు..

Posted: 07/22/2015 06:29 PM IST
Ap cabinet meeting important decisions on capital city pushkaralu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు, రాజధాని నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు సర్కార్ రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ‘రాజధాని’ అంశంపై తీవ్ర చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏపీ రాజధానిని రూపొందిస్తున్న ఏపీ సర్కార్.. ఇక నుంచి దానిమీద ఎక్కువ దృష్టి సారించినట్లుగా ఈ క్యాబినెట్ మీటింగ్ తో స్పష్టమవుతోంది. ఇక రాజధానితోపాటు పుష్కరాలు, ఎయిర్ పోర్టు నిర్మాణం, ఇంకా ఇతర వ్యవహారలపై ముఖ్యమైన నిర్ణయాలు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. వాటి వివరాలు క్రింది విధంగా వున్నాయి...

* ప్రధాని మోదీ సూచించిన విధంగా కజకిస్థాన్, తుర్కమెనిస్థాన్, ఆస్కాన్, అస్నాబాద్ తదితర రాజధానులను పరిశీలించాలని నిర్ణయం.
* రాజధాని నిర్మాణ కాంట్రాక్టుల కోసం ‘స్విస్ చాలెంజ్’లో పాల్గొనాలని చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాలకు లేఖలు.
* విశాఖపట్నం ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ కు 300 ఎకరాల భూమి కేటాయింపు.
* కర్నూలులో డీ.ఆర్.డీ.వో.కు 2 వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకారం.
* విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయం భూసేకరణపై మరింత చర్చ.
* వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలన్నీ విజయవాడకు తరలింపు.
* రెవెన్యూ విధానాన్ని మార్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ.
* పుష్కరాల ముగింపు రోజున ‘పుష్కర జ్యోతి’.
* పుష్కరాల్లో బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cabinet meeting  chandrababu naidu  ap capital city amaravathi  

Other Articles