SC Directs Telecom Operators To Provide Call Data In A Week

Andhra telangana telephone tapping squabble now being played out in supreme court

phone tapping, service providers, supreme court, cash on vote, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Supreme Court asks COAI to deposit documents related to the tapping of phones in sealed covers

ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుప్రీం కీలక తీర్పు..!

Posted: 07/23/2015 12:20 PM IST
Andhra telangana telephone tapping squabble now being played out in supreme court

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో కాల్‌డేటాను ఇవ్వాల్సిందే అని సర్వీస్‌ ప్రొవైడర్లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాల్‌డేటాను ఇవ్వాల్సిందే అంటూ బెజవాడ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వీస్‌ప్రొవైడర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిపిన అనంతరం... వారంలోగా కాల్ డేటాను అందజేయాలని న్యాయస్థానం అదేశించింది. సర్వీస్‌ ప్రొవైడర్ల తరపున ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.

కాల్‌డేటా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాల్‌డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూట్‌ చేస్తామని బెదిరించడం కారణంగానే ఇవ్వలేకపోతున్నామని సర్వీస్‌ ప్రొవైడర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదన్న సుప్రీం జ్యుడిషియల్‌ ఆర్డర్‌ ఉన్నప్పుడు దాని ముందు ఏ ఆర్డ్‌ర్స్‌ పనిచేయవని, అందువల్ల ఎవరి బెదిరింపులను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినప్పుడు కోర్టు ఆర్డర్‌ను ఎందుకు చూపించలేదని సర్వీస్‌ ప్రొవైడర్లను ధర్మాసనం ప్రశ్నించింది.
 
ఈనెల 24లోగా కాల్‌డేటా సమర్పించాలన్న విజయవాడ మెజిస్ర్టేట్‌ కోర్టు ఆదేశాలను సుప్రీం సమర్థించింది. అయితే కాల్‌డేటా సమర్పించేందుకు కొంత సమయం కావాలని సర్వీస్‌ప్రొవైడర్లు కోర్టును కోరారు. ఆ మేరకు కాల్‌డేటా ఇచ్చేందుకు మరో వారం పాటు సుప్రీం కోర్టు అవకాశం కల్పించింది. కాల్‌డేటా ఇచ్చాక సీల్డ్‌ కవర్‌ను మూడు వారాల వరకు తెరచి చూడకూడదని విజయవాడ మెజిస్ర్టేట్‌ కోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కాల్‌డేటాను స్వీకరించిన అనంతరం విచారణను నెలరోజుల పాటు వాయిదా వేయాలని విజయవాడ కోర్టును ఆదేశించింది.

కాల్‌డేటాను సర్వీస్‌ప్రొవైడర్లు నాశనం చేయకూడదని కోర్టు కోరింది. ఈలోగా అవసరమైతే హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని సర్వీస్‌ ప్రొవైడర్లకు సుప్రీం కోర్టు సూచించింది. తొలుత ఈ కేసును స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ హైకోర్టు వెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఉమ్మడి హైకోర్టు ఉన్నందుకు అక్కడి వెళ్లలేకపోతున్నామని సర్వీస్‌ ప్రొవైడర్లు తెలిపారు. ఈ క్రమంలో హైకోర్టుతో పాటు అన్ని కోర్టులపైనా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని సర్వీస్‌ ప్రొవైడర్లకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone tapping  service providers  supreme court  cash on vote  

Other Articles