ప్రధానిపై ప్రశ్నలవర్షం కురిపించిన యువరాజా వారు..! ఈ శీర్షిక చూడగానే ఇంతకీ ఎవరా ప్రధాని, ఏమా యువరాజు కథ.. అనుకుంటున్నారా..మన ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ డెరెక్టుగా అటాక్ చేశారు. అది కూడా ఏదో మీడియా సమావేశంలో కాదు. ఏకంగా పార్లమెంటు సమవేశాల్లో.. ప్రధాని మోడీగారు.. ఎన్నికల ముందు మీలో వున్న ఆ సత్తా, చురుకుదనం ఏమైందంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌన్ మోహన్ సింగ్ అంటూ ఎద్దేవా చేసిన.. మీరు.. ఇప్పుడు అదే మౌనాన్ని ఎందుకు అవలంభిస్తున్నారని నిలదీశారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అవినీతి లేని పరిపాలనను అందిస్తామన్న నరేంద్రమోడీ ప్రభుత్వం.. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినా.. ప్రధాని మౌనాన్ని వీడటం లేదని విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, లలిత్ మోదీకి సహకరించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న 40 మందికిపైగా మరణిస్తే.. దానిపై ప్రధాని ఒక్క మాటా కూడా మాట్లడకుండా మౌనం వహించిడం దురదృష్టకరమన్నారు.
గత సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు నరేంద్రమోడీపై నున్న అచెంచల విశ్వాసం.. నమ్మకం అయనను, ఆయన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిందన్న రాహుల్ గాంధీ, తమ నమ్మకాలు, విశ్వాసాలు సడలిపోవడంపై ప్రజలు దిగులు చెందుతున్నారని ఆయన పేర్కోన్నారు. నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధానినన్న విషయాన్ని మర్చిపోయి కేవలం బిజేపి పార్టీకే ప్రధానిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ కుంభకోణాలపై ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more