Nizamabad MP Kalvakuntla Kavita Free Suggestion To Rahul Gandhi | Pushkar Ghat

Kalvakuntla kavita free suggestion to rahul gandhi

mp kavitha news, kalvakuntla kavita news, kavita controversy, rahul gandhi, rahul gandhi yatra, rahul farmer trip, rahul raithu bharosa yatra, kavita comments rahul gandhi

Kalvakuntla Kavita Free Suggestion To Rahul Gandhi : Nizamabad MP Kalvakuntla Kavita Free Suggestion To Rahul Gandhi to do pushkar bath to clean their party's sins.

కవిత ఉచిత సలహాను రాహుల్ పాటిస్తాడా?

Posted: 07/24/2015 04:32 PM IST
Kalvakuntla kavita free suggestion to rahul gandhi

రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలేసుకుని తిరిగిన కేసీఆర్ ఫ్యామిలీ.. విభజన తర్వాత ఆ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆ పార్టీకి జైకొట్టిన వారు.. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలోనే ఎన్నో అన్యాయాలు, స్కాములు చోటు చేసుకున్నాయని, రాష్ట్రం అభివృద్ధి కాకుండా అవినీతితో కూరుకుపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. అటువంటి కేసీఆర్ ఫ్యామిలీలో సభ్యురాలైన నిజామాబాద్ ఎంపీ కవిత.. తాజాగా రాహుల్ గాంధీకి ఓ ఉచిత సలహా ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ గాంధీ ‘భరోసా యాత్ర’ పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే! ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత తనదైన శైలిలో రాహుల్ పై విమర్శలు చేశారు. ‘రైతు భరోసా యాత్ర’ పేరిట పర్యటిస్తున్న రాహుల్.. రైతులపై మొసలు కన్నీరు కారుస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ పార్టీ రైతులకు ఎంతో మేలు చేసిందని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో కవిత అలా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని ఆమె గుర్తుచేశారు. ఆ పాపాలన్నీ పూర్తిగా తుడిచిపోవాలంటే.. రాహుల్ గాంధీ ‘పుష్కర స్నానం’ కచ్చితంగా చేయాల్సిందేనని ఆమె ఉచిత సలహా ఇచ్చారు.

ఇక చివరగా.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన తమ ప్రభుత్వం గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించామని కవిత చెప్పుకొచ్చారు. శనివారంతో ఈ పుష్కరాలు ముగియనుండటంతో ఈ ఘాట్లకు మరింత భక్తజనం వచ్చే అవకాశం వుందని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విషయాలకు కాస్త పక్కనపెడితే.. కవిత ఇచ్చిన ‘పుష్కర స్నానం’ ఉచిత సలహాను రాహుల్ గాంధీ పాటిస్తాడా? లేదా? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalvakuntla kavita  rahul gandhi  raithu bharosa yatra  

Other Articles