Godavari Maha pushkaralu | AP | Rajahmundry | Godavari Pushkaralu, Celebration on Godavari Pushkaralu

Godavari maha pushkaralu will end on today

Godavari Maha pushkaralu, AP, Rajahmundry, Godavari Pushkaralu, Celebration on Godavari Pushkaralu

Godavari maha pushkaralu will end on today. In the next 24 hours, the curtain will be brought down on the Maha Pushakarams of river Godavari. A series of programmes have been planned at different places in the city to conclude the 12-day river festival in a grand manner.

నేటితో ముగియనున్న గోదావరి మహాపుష్కరాలు

Posted: 07/25/2015 08:07 AM IST
Godavari maha pushkaralu will end on today

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మహా పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.నేటితో పుష్కరాలు ముగుస్తుండడంతో తెల్లవారుజామునుంచే రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఘాట్లకు యాత్రికులు పోటెత్తారు. మరోవైపు ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. పదకొండు రోజుల పాటు కన్నుల పండుగలా సాగిన గోదావరి మహా పుష్కరాలు చివరి రోజుకు చేరుకున్నాయి.పుష్కరాలకు ఇవాళ ఒక్క రోజే మిగిలి ఉండడంతో యాత్రికులు భారీగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో  ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. చివరిరోజు కావడంతో ఇటు పుణ్య స్నానాలు.. మరోవైపు పిత్రు దేవతలకు పిండ ప్రదానాలు పెడుతున్నారు. పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది.

Also Read:  గొదావరి పుష్కరాలకు తగ్గని భక్తజనం.. అదే తన్మయత్వం

చివరి రోజు కావడంతో అది మరింత ఎక్కువైంది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అసౌకర్యం  కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చివరి రోజయ్యే సరికి నిన్న రాత్రే చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి ఘాట్లకు చేరుకున్నారు. మరోవైపు పుష్కరాల ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.ఏపీ ప్రభుత్వ పిలుపు మేరకు ఇవాళ అన్ని ఇళ్లల్లో పుష్కర దీపారాధన చేయనున్నారు. దాంతో పాటు సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1000 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ పుష్కర  ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు.

Also Read:  పుష్కరాల్లో గాలం వేస్తే డబ్బులే డబ్బులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles