1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకూబ్ మెమెన్ క్షమాబిక్ష పిటీషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. యాకూబ్ మెమెన్ దాఖలు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్‌పై ఇవాళ విచారించిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనంలో ఇరువురు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిందిచింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకూబ్ మెమెన్ దోషిగా తేలడంతో ఆయనకు ఈ నెల 30న ఉరి శిక్ష విధించాలని ఇప్పటికే న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
ఈ నేపథ్యంలో తనకు ఉరిశిక్ష నుంచి ఉపశమనాన్ని కల్పించాలని.. తనకు జీవిత ఖైదుగా శిక్షను విధించాలని యాకూబ్ మెమెన్ దాఖలు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్ పై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. పిటిషన్‌ను మూడో బెంచ్‌కు బదలాయించారు. జస్టిస్ దవే ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పగా... జస్టిస్ కురియర్ మాత్రం ఉరి శిక్ష అమలు చేయవద్దని తెలిపారు. దీంతో త్రిసభ్య ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకోంది. యాకూబ్ మెమెన్ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చితే ఈనెల 30న మెమెన్‌కు నాగ్‌పూర్ జైల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా త్రిసభ్య ధర్మాసనం తీర్పు యకూబ్ మెమెన్ కు అనుకూలంగా వచ్చిన పక్షంలో ఆయనకు క్షమాభిక్ష్ పెట్టి ఉరిశిక్షకు బదులు జీవితఖైదుగా శిక్షను విధించనున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more