Yakub Memon | Mumbai Blast | Pakistan

Yakub memon said that pakistan very help to mumbai bomb balsts

Yakub Memon, Mumbai Blast, Pakistan, Mumbai Attacks, Terrorists, Memon, Memon Hanged

Yakub Memon said that Pakistan very help to Mumbai Bomb balsts. "Woh sab bole the ki tu c****** hai jo wapis ja raha hai," an enraged Yakub Memon screamed before the Judge when the special TADA court awarded him the death penalty in the 1993 serial blasts case. Ten others, apart from Memon, were given death sentences, but were later commuted to life sentences. Yakub is the only person to face gallows in the case. Yakub's family maintains that he had surrendered already.

ITEMVIDEOS: పాకిస్థాన్ చాలా హెల్ప్ చేసింది.. యాకుబ్ మెమెన్ చెప్పిన నిజాలు

Posted: 07/30/2015 01:21 PM IST
Yakub memon said that pakistan very help to mumbai bomb balsts

భారత మీద దాడులు.. భారత్ లోని పలు కీలక నగరాల మీద ఉగ్రవాదుల దాడులు.. భారత ప్రజలే టార్గెట్ గా దాడులు... ఇలాంటి ఎన్నో  వార్తలకు మూలంగా నిలిచింది.. భవిష్యత్ లో నిలిచేది కూడా పాకిస్థాన్. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న వైరం గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెడుతారు. కానీ అన్నింటా భారత్ తో పోటీ పడలేని పాకిస్థాన్ భారత్ మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలని అందుకే.. ఉగ్రవాదులను ఉసికొల్పి భారత్ పై, భారత ప్రజల మీద దాడులకు ఎంకరేజ్ చేస్తోంది.  అందుకు గాను భారత్ కు వ్యతిరేకంగా ఎంతటి చర్యలకైనా కూడా పాకిస్థాన్ ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే లష్కరే తోయిబా లాంటి ఎన్నో ఉగ్రవాద సంస్థల కీలక నేతలకు భారత్ కు సంబందించిన కొన్ని వివరాలను అందించడం, వారికి తగిన రక్షణ కల్పించడం లాంటివి కల్పిస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా భారత్ మీద రకరకాలుగా కుట్రలకు పాల్పడుతోంది. ఇవన్నీ ఎవరో చేస్తున్న ఆరోపణలు కాదు. ముంబై బాంబ్ బ్లాస్ కేసులో ఉరిశిక్ష కు గురై. ఈ ఉదయం మరణదండన అనుభవించిన యాకుబ్ మెమెన్ వివరించిన వివరాలు పాక్ కుట్రల కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

Also Read : మెమెన్ ఉరితో బాధపడ్డ ఒకే ఒక్క వ్యక్తి ఎవరు..?

మెమెన్ ఉరితో బాధపడ్డ ఒకే ఒక్క వ్యక్తి ఎవరు..?

యాకుబ్ మెమెన్ ను భారత్ నుండి దుబాయ్ మీద నుండి కరాచీకి ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లిన పాక్ ఉగ్రవాదుల చిత్తశుద్దిని మెమెన్ వివరించారు. అక్కడి ఎయిర్ పోర్ట్ లో మెమెన్ కు కనీసం పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కూడా చెయ్యలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెమెన్ కు అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే కాకుండా.... అతనికి కావాల్సిన అన్ని అవసరాలను పాక్ అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు మెమెన్ స్వయంగా వెల్లడించారు. తన అన్న టైగర్ మెమెన్ తో పాటు తోఫిక్ సిద్దికి లాంటి వాళ్లు అక్కడ ఎంతో పరపతి కలిగి ఉన్నారని మెమెన్ వెల్లడించారు. ఐఎస్ఐ భారత్ లో దాడులలో భాగంగా ముంబై దాడులకు పాల్పడ్డారని మెమెన్ తెలిపారు. ఉగ్రవాదం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ పాకిస్థాన్ అందుకు వ్యతిరేకంగా పోరాడుతుందని నీతి పలుకులు పలికే పాకిస్థాన్ అసలు రూపం ఏంటో మెమెన్ వెల్లడించారు.

Also Read : యాకుబ్ మెమెన్ ఉరి.. మృతదేహానికి పోస్టుమార్టం
Also Read :  యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై సల్మాన్ అభ్యంతరం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yakub Memon  Mumbai Blast  Pakistan  Mumbai Attacks  Terrorists  Memon  Memon Hanged  

Other Articles