తాగడానికి మంచినీరు లేని సింగపూర్ ప్రపంచాన్ని శాసిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం పైన కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామజ్యోతి కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలను భాగస్వామ్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పు సాధించేలా చూడాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ జరిగిందన్నారు. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదన్నారు. ప్రజల సంఘటిత శక్తి బలం ఏమిటో గుర్తించాలన్నారు. ఎవరి ఊరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునేలా ప్రజలకు నేర్పాలన్నారు. ప్రజలంతా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం సాధఇంచి పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పు సాధించాలన్నారు. గంగదేవిపల్లి, అంకాపూర్, ములకనూరు సహకార వ్యవస్థలు ఆదర్శమని చెప్పారు. ప్రజలను గ్రామజ్యోతిలో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చేయాలన్నారు. గ్రామజ్యోతిలా పట్టణ జ్యోతి ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకోసం గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, పట్టుదల ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేసిన దగ్గర మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మిగతా చోట్ల కూడా అదే తీరుగా మారాలని తెలిపారు. గోదావరి పుష్కరాలను అధికారులు అద్బుతంగా నిర్వహించారని అన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. పోలీసులు చాలా మర్యాదగా ప్రవర్తించారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగి దేశం దృష్టిని ఆకర్షించిందని వివరించారు. మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ అధికారులు, హైకోర్టు, కేంద్ర మంత్రులు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామజ్యోతిని నిర్వహించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more