వరుసగా రెండో రోజు స్టాక్ మార్కట్లకు లాభాల్లో పయనించాయి. స్టాక్ మార్కట్లు బ్లెడ్ బాత్ ను చవిచూసిన అనంతరం మెల్లిగా కోలుకున్న మార్కెట్లు నిన్న లాభాలను ఆర్జించగా, ఇవాళ అంతకన్న అధికంగా లాభాలను అర్జించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు అమెరికా వృద్ధిరేటు పుంజుకుంటోందన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. ఆసియా మార్కెట్ ను చైనా అర్థిక సంక్షోభం కుదిపేస్తున్నా.. ఆ ప్రభావం మాత్రం దేశీయ సూచీలపై కనబడలేదు. అమెరికా ఫెడ్ రిజర్వు సానుకూల నిర్ణయాలను తీసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో సూచీలు లాభాల భాట పట్టాయి. .
అయితే జూలై సిరీస్ లో మాత్రం సెన్సెక్స్ నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించింది. అటు నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలను ఆర్జించింది. జూలై సిరీస్ లో సెన్సెక్స్ 0.7 శాతం నష్టాన్ని చవిచూడగా, ఎఫ్ఎంజీసీ, ఐటీ సంబంధించి సూచీలు మాత్రం లాభాలను ఆర్జించాయి. ఎఫ్ఎంజీసీ 4.7 శాతం వృద్దిని సాధించగా, ఐటీ సెక్టార్ మాత్రం 3.3 శాతం వృద్దిని సాధించింది. ఈ సిరీస్ లో లోహానికి సంబంధించిన సూచీలు మాత్రం 9 శాతంతో వెనకంజలో నిలిచాయి. అధిక విస్తారం కలిగిన మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు కూడా ఈ సిరీస్ లో లాభాలను గడించాయి. మధ్యతరహా 4, చిన్న తరహా పరిశ్రమ సూచీలు 5 శాతం వృద్దిని నమోదు చేసుకున్నాయి.
కాగా ఇవాళ ఉదయం ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేసకున్నాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాన్ని అర్జించగా, అటు నిష్టీ కూడా 58 పాయింట్ల లాభాన్ని అర్జించింది. అయితే ఆ లాభాలను అదిమి పట్టుకోవడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఎలాంటి నిర్ణయాలను వెలువరిస్తుందోనన్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదోడుకులకు గురైయ్యాయి. కాగా చివరికి మాత్రం లాభాలనే ఆర్జించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 27 వేల 705 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 8422 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజీ, లోహానికి సంబంధించిన రంగాలు నష్టాలను చవిచూడగా, ఎఫ్ ఎం జీ సీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమక రంగాలకు చెందిన సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, అటో, కన్జూమర్ డ్యూరబుల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్డార్ యూనిట్స్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ తరుణంలో బ్యాంక్ అఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఐటీసీ, తదితర సంస్థల షేర్లు లాభాలను గడించగా, ఎన్ఎండీసీ, సన్ ఫార్మ, హిండాల్కో, ఇన్పోసిస్, కోటక్ మహింద్రా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more