Rishitheshwari | Rishitheshwari suicide | Rishitheshwari death

Rishitheshwari parents met ap minister ganta srinivas

Rishitheshwari, Rishitheshwari suicide, Rishitheshwari death, nagarjuna university

Rishitheshwari parents met ap minister Ganta srinivas. They request to do justice on their daughter rishitheshwari suicide.

ITEMVIDEOS: మంత్రి గంటాను కలిసిన రిషితేశ్వరి తల్లిదండ్రులు

Posted: 07/31/2015 11:28 AM IST
Rishitheshwari parents met ap minister ganta srinivas

కన్న కూతురు క్యాంపస్ లో ఆత్మహత్యకు పాల్పడింది.. తోటి విద్యార్థులే పిశాచాలుగా ఆమె చావుకు పురిగొల్పారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన రిషితేశ్వరి మృతిపై అంతకంతకు నిరసనలు వ్యతిరేకత వస్తోంది. తాజాగా తమ కూతూరి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులు నేడు విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. విచారణ నిష్పక్షపాతంగా జరిపిస్తామని పేర్కొన్నారు. కాగా రిషితేశ్వరి మృతిపై ఏర్పాటైన బాలసుబ్రమణ్యం కమిటీ నేడు మరోమారు మృతురాలి తల్లిదండ్రులను కలిసి వివరాలు సేకరించనుంది.

Also Read :  మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం
Also Read :  రిషితేశ్వరిపై ఈ ముగ్గురి మౌనమేల...?

కాగా రిషితేశ్వరి మృతికి కారణమైన సీనియర్లను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు... మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క బాలసుబ్రహ్మణ్యం కమిటి రిషితేశ్వరి మృతి మీద దర్యాప్తు కొనసాగిస్తోంది. రిషితేశ్వరి మృతికి అసలు కారణాలేంటి.. క్యాంపస్ లో విద్యార్థులపై ర్యాగింగ్ ఆరోపణల్లో ఎంత వరకు నిజముంది... ప్రిన్సిపల్ హస్తం ఎంత వరకు ఉంది.. కుల రాజకీయాలు క్యాంపస్ లో ఎంత వరకు పనిచేస్తున్నాయి.. ఇలా అన్నింటి మీద బాలసుబ్రహ్మణ్యం కమిటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే విద్యార్థులు రిషితేశ్వరి మృతి మీద ప్రిన్సిపాల్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

rishitheshwari-012

Also Read :  రిషితేశ్వరి ఆత్మహత్య - ఎన్నో ప్రశ్నలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishitheshwari  Rishitheshwari suicide  Rishitheshwari death  nagarjuna university  

Other Articles