special status is andrapradesh right says rahul gandhi

Rahul gandhi suggests wage war on special status issue

rahul gandhi, raghuveera reddy, ys jagan, ysr congress, andhra pradesh, congress, special status, agitational pragramme, AICC vice president Rahul gandhi, special status to Andhra Pradesh, PM narendra Modi, central government, TDP, chandrababu naidu

AICC vice president Rahul gandhi to wage war against PM narendra Modi government on special status to Andhra Pradesh and suggested APPCC president Raghuveera Reddy to chalk out agitational pragramme on the same issue.

సన్నద్ధంకండీ.. ప్రత్యేకహోదాకోసం ఉద్యమిద్దాం.. రఘవీరాతో రాహుల్

Posted: 08/01/2015 10:05 PM IST
Rahul gandhi suggests wage war on special status issue

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పోరాటానికి ఏపీ కాంగ్రెస్ సిద్దమయ్యింది. ఈ మేరకు అధిష్టానం నుంచి ఏపీ పిసీసీ అధ్యక్షుడికి అనుమతి కూడా లభించింది. ఈ విషయంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాహుల్‌గాంధీతో ఫోన్లో మాట్లాడారు. నిధలు లేమితో, రాజధాని లేని రాష్ట్రంగా వున్న ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని రఘువీరా ఆయనకు వివరించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తూ.. కట్టుకథలు చెబతుందని ఆయన వివరించినట్లు సమాచారం.

దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో చర్చిస్తామని హామి ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యేక హోదాపై ఏ స్థాయి పోరాటానికైనా తాము సిద్దమని ఆయన చెప్పారు. హోదా కోసం ఉద్యమించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపోందించాలని కూడా ఆయన అదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా హోదా కోసం రాజ్యసభలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలో కూడా వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్లుండి అందుబాటులో ఉన్న నేతలతో రఘువీరా సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటానికి సిద్ధంకావాలని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. టీడీపీ బీజేపీ లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు వెయ్యిజన్మలు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేరని రఘువీరా ఎద్దేవా చేశారు. ఇక మరోవైపు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇవాళ అనంతపురంలో నేతలు బూట్ పాలిష్ చేసి.. నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంలో కాంగ్రెస్ ముందుకెళ్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  raghuveera reddy  andhra pradesh  congress  special status  

Other Articles