Centre promises financial support to AP

Jaitley assures states with special problems of help

Andhra Pradesh, Arun Jaitley, Lok Sabha , Centre promises financial support to AP, jaitley assures states with special problems of help, financial support, revenue losses, "special help", bifurcation of the state

Amid demand for special category status for Andhra Pradesh, the government today promised to provide financial support to the state for 5 years to meet revenue losses, saying it needs "special help" in view of bifurcation of the state last year.

నవ్యాంధ్రకు అంచానకు మించిన ఆర్థిక సాయం.. హోదాకు మంగళం..?

Posted: 08/05/2015 11:39 PM IST
Jaitley assures states with special problems of help

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అటకెక్కినట్టేనా అంటే అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు సాక్షిగా కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పానా.. అది తమ విషయంలో కాదని, రాష్ట్ర విభజనతో అర్థికంగా వెనకబడి సమస్యలలో కూరుకుపోయిన తమకు వర్తించదని చెబుతూ వచ్చిన నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజనతో అర్థికంగా సుడిగుండంలో చిక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన పార్లమెంటులో ప్రకటన చేశారు.

విభజన వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. విభజనతో  హైదరాబాద్‌ లేకపోవడంతో ఏపీకి ఆదాయం పడిపోయిందని జైట్లీ విశ్లేషించారు. ఏపీకి తొలి ఏడాది వీలైనంత సాయం అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఏపీకి అర్థిక తోడ్పాటు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

 ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం కూడా అడిగే హక్కులేదని ఆయన అన్నారు .ఏపీకి  అంచనా కంటే ఎక్కువ పరిహారం అందేలా చూస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక నష్టాలను అధిగమించేలా సహకరించడం తమ అజెండాలో ఉందని చెప్పారు. అభివృద్ధి రేటు 9కి చేరితే అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏపీకి ఆర్థిక తోడ్పాటును అందించడమే ధ్యేయమని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Arun Jaitley  Lok Sabha  financial support  

Other Articles