వరుసపెట్టి తెలుగు సినిమాలు భారీ హిట్లు కొడుతుండటం, వందలకోట్ల వసూళ్లు చేస్తుండటంతో.. అన్నీ మంచి శకునములే అని భావించిన చిరంజీవి.. తన 150వ సినిమా కోసం రెడీ అయిపోతున్నారా..? అంటే అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. ఇందుకు చిరంజీవి కొత్త లుక్తో కూడిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్లూ కలర్ ఫేడెడ్ జీన్స్, దానిమీద రౌండ్ నెక్ టీషర్టు ధరించిన చిరంజీవి, గాగుల్స్ పెట్టుకుని డార్క్ బ్లూ కలర్ గోల్ఫ్ కార్టును ఆనుకుని ఫొటోకు పోజిచ్చారు.
ఈ ఫోటోలు నెట్ లో సందడి చేస్తుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఎప్పడెప్పుడా అంటూ ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు.. ఇటీవల ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ట్విట్ తో ఇప్పుడు, అప్పుడు అంటూ ఎదురుచూస్తున్న తరుణలో మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ తో ఈ ఫోటోలు తన 150 చిత్రానికి సంబంధించినవా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. లేక రాంచరణ్ తేజ్ తాజా చిత్రంలో ఆయన నటిస్తున్నారన్న వార్తులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫోటోలు ఆ చిత్రానికి సంబంధించినవా..? అంటూ అభిమానులు గెస్ చేసుకుంటున్నారు.
ఇక మరికోందరు అభిమానులైతే.. ఇన్నాళ్లు జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలకు ఈ సారి జరగనున్న వేడుకలకు భిన్నంగా ఒక్క రోజు బదులు వారోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో తన జన్మదిన వారోత్సవాలకు సంబంధించి మెగాస్టార్ దిగిన ఫోటోలని ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలు అటోజానీ చిత్రానివా..? లేక ఏ సందర్భంలో దిగనవంటూ బెట్టింగ్ లకు కూడా పాల్పడతున్నారు అభిమానులు. ఇక మరికోందరైతే.. తమ హీరో లేటెస్టు ఫోటోలను చూసి.. హాయ్ మెగాస్టార్ అంటూ గుండెలకు హత్తుకుంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more