ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీ అంశంలో సహకరించిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, ముఖ్యమంత్రి వసుందరా రాజేలను తక్షణం పదవుల నుంచి తప్పించాలని, వ్యాపం స్కాంలో అభియోగాలను ఎదుర్కోంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లను విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఎంపీలు వరుసగా నాల్గవ రోజు పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
బీజేపీ అవినీతిపై నిలదీస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం పాటిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. ‘‘ప్రభుత్వానికి సిగ్గు లేదు... ప్రధానమంత్రికి మాటల్లేవంటూ’’ ఫ్లకార్డులు ప్రదర్శించారు. మనసులో మాటలు, ప్రవచనాలు చెప్పడం మానేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రుల అవినీతి గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో వెంటనే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అంతవరకు ఎలాంటి చర్చ జరగనివ్వబోమని వారు స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు. సుష్మా స్వరాజ్ నాటకాలాడటంలో నేర్పరి అని దుయ్యబట్టారు. 'ఒకవేళ నేనే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉండేదుంటే ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేదాన్ని.. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కాదు' అని సోనియా అన్నారు.
కేవలం మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సహాయం చేశానని సుష్మాస్వరాజ్ చెప్పడాన్ని అమె తప్పుబట్టారు. తాను అమె స్థానంలో వున్నా ఇలానే చేసేవారన్న సుష్మా వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోనియా ఈ కామెంట్లు చేశారు. కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన తల్లి అలా వ్యవహరించిం వుందేది కాదని అన్నారు. లలిత్ మోడీ నుంచి తెరచాటుగా డబ్బు తీసుకున్న సుష్మాస్వరాజ్ అయనకు సహకరించిందని అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఎవరికీ తెలియకుండా కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయని ఆరోపించారు. ఎక్కడైతే దొంగతనాలు జరుగుతాయో అక్కడ లావాదేవీలకు అస్కారముంటుందని అన్నారు. తన కూతురు, భర్తల మోడీ నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చారన్న విషయాన్ని అమె దేశ ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more