Pakistan Police Arrest Man in Wasim Akram Shooting Incident

Man arrested in wasim akram shooting incident

Man arrested in Wasim Akram shooting incident, Wasim Akram, Cricket, Wasim Akram's Car Attacked in Karachi, Speedster Unhurt, latest Cricket news, pakistan cricket, former captain Wasim Akram, bowling assignment with Pakistan Cricket Board, National Stadium at karachi, car hit from rare side, fire from another car, government officials car, registration plate number

Pakistani police has arrested a man in connection with the road rage incident in which an unidentified person opened fire at cricket legend Wasim Akram.

వసీం అక్రమ్ పై కాల్పుల కేసులో అనుమానితుడి అరెస్ట్

Posted: 08/08/2015 08:40 PM IST
Man arrested in wasim akram shooting incident

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్పీడ్ స్టర్ వసీం అక్రమ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఓ అనుమానిత వ్యక్తిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ్ ను లక్ష్యంగా చేసుకుని అతని కారుపై కాల్పుల జరిపిన సమయంలో ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్ ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. క్యుదాబాద్ దావుద్ చొవ్రంగి ప్రాంతంలో ఉన్న సదరు వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లు కరాచీ ఈస్ట్ జోన్ డీఐజీ మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు.మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. అక్రమ్ బుధవారం కారుపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. యువ పేసర్లకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్టేడియానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే కర్సాజ్ ప్రాంతంలో అక్రమ్ నడుపుతున్న కారు స్వల్ప ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయిన సమయంలో పక్క కారులో నుంచి ఓ గుర్తు తెలి యని వ్యక్తి కిందకు దిగి ఒక్కసారిగా ఫైరింగ్‌కు దిగాడు. యితే ఈ సంఘటన నుంచి క్రికెటర్ క్షేమంగా బయటపడ్డాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles