MP Kambhampati Haribabu Says Central Govt Plans To Give More Funds Than Special Status To Andhra Pradesh State

Central govt plans more funds than special status to andhra pradesh mp kambhampati haribabu

ap special status, kambhampati haribabu, bjp mp kambhampati, ap funds, special funds to ap, ap special funds, ap special status controversy, andhra pradesh state, ap capital city, amaravathi, capital city amaravathi, central govt

Central Govt Plans More Funds Than Special Status To Andhra Pradesh MP Kambhampati Haribabu : MP Kambhampati Haribabu Says Central Govt Has Making Plan To Give More Funds Than Special Status To Andhra Pradesh State.

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కాదు.. అంతకుమించి..?

Posted: 08/10/2015 05:49 PM IST
Central govt plans more funds than special status to andhra pradesh mp kambhampati haribabu

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రరాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని బీజేపీ పార్టీ ఢంకా బజాయించి మరీ చెప్పింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రప్రజల్ని కొన్నాళ్లపాటు ఊరించింది. అదిగో అప్పుడు.. ఇదిగో ఇప్పుడు.. అంటూ వాయిదాల మీద వాయిదా వేస్తూ వచ్చింది. కానీ.. ఒకానొక సమయంలో అసలు ప్రత్యేక హోదా ఇవ్వడమే సాధ్యం కాదంటూ తేల్చి చెప్పేసింది. అంతే! ఆ విధంగా కేంద్రం చెప్పడంతో రాష్ట్రప్రజలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం రాష్ట్ర ప్రజల్ని తమవైపు ఆకర్షించుకోవడం ఇదే అదును అని భావించి.. ప్రత్యేక హోదా కోసం పోరాటం పేరుతో సభలమీద సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశమై గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇటువంటి సమయంలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాత్రం మరో ఆసక్తికరమైన విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా నిధుల గురించి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఆయన తాజాగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి వుందని, ప్రతిపక్షాలు లేనిపోని అపోహాలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెబుతున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రజలు వాటిని నమ్మొద్దని ఆయన సలహా ఇచ్చారు. అలాగే.. లేనిపోని అపోహల్ని సృష్టించవద్దని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఇక ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. ప్రభుత్వం ఆ హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా.. దాని అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఇప్పటికే వెయ్యికోట్లు మంజూరు చేసిందని కంభంపాటి గుర్తు చేశారు. అంతేగాక.. విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ మహత్తర ప్రయత్నాలు కొనసాగిస్తోందని కంభంపాటి వెల్లడించారు. మరి.. ఈయన చెప్పినట్లు కేంద్రం ఆ ‘రెట్టింపు నిధుల’ విషయాల్ని ఎప్పుడు వెల్లడిస్తుందో..? ఇంతకు ఇది నిజమేనా..? ఒకవేళ నిజమే అయితే ఇన్నాళ్లు ఎందుకు వెల్లడించలేదు..? ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇటువంటి డ్రామాలు ప్లే చేస్తుందేమో..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap special status  kambhampati haribabu  amaravathi  

Other Articles