గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య వివాదం ఇంకా చల్లారకముందే ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థిని భూక్యా మౌనిక(19) మిస్టరీ కలకలం సృష్టిస్తోంది. జిల్లా మహిళా కాలేజీలో బీఏ ఫైనలియర్ చదువుతున్న ఈమె.. ఆదివారం తన ఊరికి వెళ్తున్నానని చెప్పి సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లా ఆస్పత్రిలో శవమై కనిపించింది. ఈమె మృతదేహాన్ని ఇద్దరు ఆగంతుకులు తీసుకువచ్చి.. =ఒకరు మౌనిక తండ్రి రామచంద్రుకు ఫోన్‌చేసి ‘మీ అమ్మాయి ఉరి వేసుకుంది.. జిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అంతే.. అప్పటినుంచి ఆ ఇద్దరు కనిపించడం లేదు. దీంతో ఈమె మృతితో వారిద్దరికి సంబంధం వుంటుందన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పారిపోయిన ఇద్దరు అగంతకుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిలో ఒకరిని కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మౌనిక మృతి వెనుక ఆ అబ్బాయి హస్తం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా.. మౌనిక సెల్‌ఫోన్‌కు ‘నీ అంతు చూస్తా..’ అంటూ వచ్చిన ఓ మెసేజ్‌పైనా పోలీసులు దృష్టి సారించారు. మౌనిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఆ మెసేజ్ గురించి ఆరాతీయగా.. అది ఆ యువకుడి నంబర్ నుంచే వచ్చినట్టు గుర్తించారు. అదే నంబర్ నుంచి శనివారం రాత్రి మౌనిక సెల్‌కు దాదాపు 50 మిస్డ్ కాల్స్ రావడం గమనార్హం. మౌనికకు చెందిన ఒక నోట్‌పుస్తకంలో ఓ యువకుడి ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ యువకుడి ఫొటో.. మౌనికను ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంగా సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన ఇద్దరు యువకుల్లో ఒకరిని పోలి ఉంది. దీంతో ఈ యువకుడికి మౌనిక మృతికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మౌనిక తరచుగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఓ యువకుడితో మాట్లాడుతూ ఉండేదని.. అప్పుడప్పుడు అతడు మామిళ్లగూడెంలో ఆమె ఉంటున్న స్వధార్‌హోంకు వచ్చేవాడని, అతడి పేరు రాము అని మౌనిక స్నేహితులు తెలిపారు. అయితే.. శనివారం సాయంత్రం ఓ యువకుడు మౌనికతో గొడవపడి చేయి కూడా చేసుకున్నాడని, ఆ యువకుడు ఎవరని అడిగితే మౌనిక రోదించింది తప్ప అతడి పేరు చెప్పలేదని వారు పేర్కొన్నారు. మరోవైపు.. కొంతకాలంగా ఓ యువకుడు తనను ప్రేమించమంటూ మౌనికపై వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు తెలిసింది. ఆ యువకుడు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నవాడే అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. వేధింపుల సంగతిని మౌనిక ఇటీవల ఆమె సోదరితో కూడా చెప్పి బాధపడినట్లు తెలిసింది. మొత్తానికి మౌనిక డెత్ మిస్టరీ ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more