Tamilnadu Polices Red Handed Caught Who Try To Stolen Thieves House in Kuppam

Tamilnadu polices try to stolen thieves house kuppam

tamilnadu police, kuppam crime news, dabbavolu species, police theft, police stolen, police thieves, police houses, dabbavolu members, dabbavolu people, chittor kadapa

Tamilnadu Polices Try To Stolen Thieves House Kuppam : Tamilnadu Polices Red Handed Caught Who Try To Stolen Thieves House in Kuppam.

దొంగతనం చేసిన డబ్బును దోచుకెళ్లిన తమిళ పోలీసులు

Posted: 08/12/2015 11:18 AM IST
Tamilnadu polices try to stolen thieves house kuppam

దొంగా-పోలీస్ ఆటంటే.. దొంగతనం చేసిన డబ్బును స్వాధీనం చేసుకుని దొంగల్ని అరెస్ట్ చేస్తారని విన్నాం కానీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. ఎక్కడినుంచో దొంగతనం చేసి డబ్బు తెచ్చుకున్న దొంగల్ని అరెస్ట్ చేయడం పక్కనపెట్టేసి.. వారి నుంచే ఆ సొమ్మును దోచుకోకున్నారు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటన తరచూ కుప్పం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో ఇటువంటి వ్యవహారాలు కాస్త తక్కువగానే వుండేవి కానీ.. ఇప్పుడు మరింత పెచ్చుమీరిపోయాయి. తాజాగా ఇటువంటిదే మరొకటి జరిగింది. అయితే.. ఈసారి ఆ గ్రామప్రజలు కాస్త చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ దొంగ పోలీసులు పట్టుబడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పం పరిసర గ్రామాల్లో ‘డబ్బావోలు’ అనే తెగ వారు నివసిస్తున్నారు. వీరు సంచార దొంగలు. ఇంటిల్లిపాదీ పక్కరాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసొచ్చి దర్జాగా బతుకుతుంటారు. ఈ విధంగా బతుకుతున్న వీరికి ఇతరుల నుంచి ఎటువంటి ఇబ్బందులైతే తలెత్తలేదు కానీ.. తమిళనాడుకు చెందిన పోలీసుల ఆగడాలతో మాత్రం వేగలేకపోతున్నారు. తామే పెద్ద దొంగలమని ఆ జాతివారు భావిస్తే.. తమకంటే గొప్పవాళ్లమని తమిళ పోలీసులు నిరూపించుకుంటున్నారు. అంటే.. ఎక్కడినుంచో ఆ తెగవారు డబ్బును దొంగతనం చేసి తీసుకువస్తే.. తమిళ పోలీసులు వారుంటున్న ప్రాంతానికి రాత్రివేళల్లో వెళ్లి ఆ డబ్బును దోచేసుకుంటారు. మొదటి వారి ఇళ్లపై రాళ్ల దాడి చేస్తారు. ఆ తర్వాత వారి ఇంటిపై పడి అందినంతా దోచుకెళ్తారు. ఇలా జరగడం సర్వసాధారణమే.

ఆ తరహాలోనే తాజాగా కొందరు పోలీసులు సాధారణ దుస్తుల్లో ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో చేరుకున్నారు. నారాయణ, వేలు అనే ‘డబ్బావోలు’కు చెందిన వ్యక్తుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్తులు చాకచక్యంగా వారికి అడ్డుకున్నారు. దోచుకున్న డబ్బంతా ఏమైందని ఆరాతీస్తే.. అప్పటికే తాము కొట్టేసిన బంగారం, డబ్బులను ఊరు దాటించినట్లు వారు పేర్కొన్నారు. కానీ.. వెండి ఆభరణాలు మాత్రం తమవద్దే వున్నాయని తెలిపారు. ఈ దెబ్బతో అక్కడికి ‘దొంగ’పోలీసులు రాకపోవచ్చునని భావిస్తున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ తమకు మాత్ర ఎటువంటి ఫిర్యాదులు అందడం లేదని, అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నామని ఏపీ పోలీసులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu police  chittor kuppam  dabbavolu species  

Other Articles