తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఓటుకు నోటు కేసు, దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ముత్తయ్య పిర్యాదుతో నమోదు చేసిన కేసులు మరో కీలక మలుపు తిరగనున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారసుల వ్యక్తిగత మనుషుల చుట్టూ ఈ కేసు బిగుసుకోనుంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కొండల్ రెడ్డిని ఏసీబి అధికారులు విచారించనున్నారు. కొండల్‌రెడ్డి కోసం మంగళవారం టీడీపీ ఆఫీసుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆఫీసులో కొండల్‌రెడ్డి లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ గన్మెన్లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడారని ఏసీబీ అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ కొండల్‌రెడ్డికి విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబి అధికారులు 160 సీఆర్పీపీసీ కింద నోటీసులు జారీ చేశారు.
మరోవైపు జెరూసలెం మత్తయ్యను బెదిరించిన కేసులో నోటీసులు జారీ చేసుందుకు ఏపీ సీఐడీ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్ మెన్ సత్యనారాయణతో పాటు డ్రైవర్లకు సీఐడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను వీరిద్దరు ఫోన్ ద్వారా బెదిరించారని మత్తయ్య అరోపించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 14న విజయవాడకు విచారణ నిమిత్తం హాజరుకావాలని ఏపీ సిఐడి పోలీసులు నోటీసులలో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారని తెలుస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more