Transport Minister Diwakar Raote Fined His Son For Misbehaving With Constable | Mumbai Police

Diwakar raote fined his son for misbehaving with constable

Diwakar Raote news, Diwakar Raote son, Diwakar Raote latest news, drunk and drive case, drunk n drive news, Diwakar Raote son drunk n drive, mumbai police, political leaders

Diwakar Raote Fined His Son For Misbehaving With Constable : Transport Minister Diwakar Raote Fined His Son For Misbehaving With Constable during a campaign against drunk driving.

రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన ‘మహా’మంత్రి

Posted: 08/13/2015 12:13 PM IST
Diwakar raote fined his son for misbehaving with constable

రాజకీయ నాయకుల వ్యవహారశైలి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హోదా దక్కిందని అహంకారం ప్రదర్శిస్తుంటారు. అవినీతి, అక్రమాలకూ పాల్పడుతుంటారు. అయితే.. ఈ నాయకులు తమ గౌరవార్థం అప్పుడప్పుడు కాస్త మంచివారిలా ప్రవర్తిస్తుంటారు కానీ వీరి వారసులు మాత్రం తమదే రాజ్యమన్నట్లుగా గొప్పగా ఫీలైపోతుంటారు. తమని ఎవరైనా, ఏమైనా అంటే చాలు.. వారితో వాగ్వాదానికి దిగడం, రౌడీయిజం ప్రదర్శించడం, అబ్బో ఇంకా రకరకాలుగా తమలో దాగిన పైశాచికత్వాన్ని చూపిస్తారు. పదిమందిలో కేవలం ఒకరిద్దరు మంచివారుంటారు తప్ప.. మిగతావారు ఆ కేటగిరికిందకే వస్తారు. వీరి మీద ఎటువంటి కేసులు నమోదు కావు.. ఎందుకంటే వారి తండ్రి ఏదో ఒక పదవిలో కొనసాగుతుంటారు కాబట్టి. ఇలాగే ఓ మంత్రి కొడుకు కాస్త విర్రవీగితే, అతని తోక ముడిచి ఆదర్శనీయుడైన మంత్రిగా వార్తల్లో నిలిచాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివసేన నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావోతే తనయుడు అయిన ఉన్మేశ్ ను డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే అతడిని ప్రశ్నించగా.. ఉన్మేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేనెవరో, నా తండ్రెవరే తెలుసా..?’ అంటూ రాగాలూ తీశాడు. కొద్దిసేపు వారితో వాగ్వాదానికి దిగాడు. చివరికి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం తతంగాన్ని మరుసటి రోజు ఉదయం మంత్రి రావోతేకు తెలిసింది. అంతే! వెంటనే ఆయన తన కుమారుడిని మందలించి, విధి నిర్వహణలో వున్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రూ.1000 ఫైన్ కట్టాలంటూ స్పష్టం చేశారు. ఎంత మంత్రి వారసుడైతే మాత్రం.. నిబంధనలు అందరికీ వర్తిస్తాయంటూ తన చర్య ద్వారా చాటి చెప్పి.. ఆదర్శనీయుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు.

ఈ ఘటనపై మంత్రి దివాకర్ మాట్లాడుతూ.. ‘పోలీసులు తమ విధి నిర్వస్తున్నారు. ప్రతిఒక్కరిని తనిఖీ చేస్తుంటారు. కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తుంటారు. నేను మంత్రైనాగానీ, ఇలాంటి విషయాల్లో నా కుమారుడికీ మినహాయింపు ఇచ్చేది లేదని నిరూపించాను’ అని పేర్కొన్నారు. రావోతే ఈ విధంగా వార్తల్లెకెక్కడం ఇది మొదటిసారి కాదు.. ఇంతకు ముందు ఓసారి హెల్మెట్ లేకుండా బైక్ పై వెళుతున్న ఓ కానిస్టేబుల్ కు జరిమానా విధించి, అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diwakar Raote  Drunk n Drive  

Other Articles