Controversial God Woman Radhe Maa Given Clarification On Wearing Red Color Skirt

Radhe maa clarification on wearing red color skirt

radhe maa, radhe maa news, radhe maa controversy, radhe maa news, radhe maa photo shoot, skirt, assets controversy, radhe maa news

Radhe Maa Clarification On Wearing Red Color Skirt : The Controversial God Woman Radhe Maa Given Clarification On Wearing Red Color Skirt.

‘పొట్టి స్కర్టు’ సీక్రెట్ రివీల్ చేసిన రాధే మా

Posted: 08/14/2015 11:59 AM IST
Radhe maa clarification on wearing red color skirt

తనను తాను దేవతగా ప్రచారం చేసుకున్న రాధే మా.. ఆ మధ్య ఎరుపురంగులో వున్న పొట్టిడ్రెస్సులు వేసుకుని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పటికీ ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వెల్లడించారు. దేవతగా డబ్బా కొట్టుకుంటున్న రాధే మా పొట్టి డ్రెస్సులు వేసుకుని అశ్లీలతకు ప్రచారం చేయడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను ఆ డ్రెస్సు ఎందుకు ధరించిందన్న విషయమై తాజాగా ఇచ్చిన ఇంరట్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది.

తన భక్తులు ఏం కోరితే దాన్ని తాను తీర్చాల్సిందేనని పేర్కొన్న రాధేమా.. ఆ ఎరుపురంగు స్కర్టు వేసుకున్నది భక్తుల కోసమేనని స్పష్టం చేసింది. తనకు అత్యంత దగ్గరి భక్తులతో కలిసి విదేశాలకు వెళ్లిన సమయంలో ఆ ఘటన చోటు చేసుకుందని.. భక్తులకు ఆనందంగా వుంచేందుకే తాను ఆ పొట్టి డ్రెస్ ధరించానని ఆమె పేర్కొంది. తన భక్తులే ఆ దుస్తులను తనకు ధరింపజేసి మేకప్ వేశారని.. అయినా ఆ పొట్టి డ్రెస్ ధరించడంలో తప్పేముందని ఆమె తిరిగి ప్రశ్నించింది. కానీ.. తన ప్రతిష్టను దిగజార్చేందుకు వాటిని ఎవరో విడుదల చేశారని ఆమె ఆరోపించింది. ఆ ఫోటోలను మీడియా ప్రచురించడం చాలా తప్పని, ఈ తరహా చర్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని రాధే మా వెల్లడించింది.

ఇక తన ఆస్తుల విషయమై రాధేమా మాట్లాడుతూ.. ప్రస్తుతం తన వద్ద కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే వున్నాయని ఆమె స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ డబ్బు తన దగ్గర లేదని, అవసరమైతే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చునని ఆమె తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radhe maa  assets controversy  god woman  

Other Articles