UAE is mini India says PM Modi on the way to gulf region

Pm narendra modi on way to uae says gulf region vital for india

UAE,Narendra modi,United Arab Emirates , PM Modi leaves for UAE on two-day visit,news, India news,Current Affairs News,Current Affairs News in India ,New Delhi, telugu news

Prime Minister Narendra Modi has begun a stand-alone bilateral visit to the United Arab Emirates (UAE), a near-abroad country so important for India

అరబ్.. పట్టణాలు.. అవి మినీ భారత దేశాలే..

Posted: 08/17/2015 08:40 AM IST
Pm narendra modi on way to uae says gulf region vital for india

అబుదాబీ: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ వెంటనే అరబ్ రాజు ఆయనను సాధరంగా ఆహ్వానించారు. అనంతరం రాజుతో మోదీ భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ అరబ్ కంట్రీ తనకు మినీ ఇండియా అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు అరబ్ దేశాలు ఎప్పటికీ ముఖ్యమైనవేనని చెప్పారు. ఆదివారం ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి బయలు దేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని అరబ్ కంట్రీస్కు వెళతున్నారని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ గల్ఫ్ దేశాలతో ముందుంటుందని, ఆ దేశాలు తన మనసుకు మినీ ఇండియాలా అనిపిస్తాయని, అక్కడ దాదాపు 26లక్షలమంది భారతీయలు జీవిస్తున్నారని తెలిపారు. భారత్కు ముఖ్య అవసరాలైన రక్షణ, శక్తి, ఆర్థికాభివృద్ధి వంటి అంశాల్లో గల్ఫ్ పాత్ర ముందుంటుందని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister  Narendra modi  UAE Tour  foreign Tour  

Other Articles