thief swallows 4 tola mangalsutra due to fear of facing arrest

Cops wait for thief to excrete stolen gold

Thief Swallows 4 Tola Mangalsutra Due To Fear Of Facing Arrest, Thief, vikas, railway police, Mangalsutra, Fear Of Facing Arrest, 4 Tola gold Mangalsutra, chain-snatcher, Thief swallows gold chain, police wait for excretion

Railway police, an elderly couple and Gandhi Hospital doctors have been saddled with an unpalatable job of keenly examining faeces of a 22-year-old chain-snatcher, Vikas, for the past two days.

ITEMVIDEOS: ఈ దోంగ తెలివితేటలు.. సక్రమార్గంలో పెట్టుంటే..

Posted: 08/18/2015 09:55 PM IST
Cops wait for thief to excrete stolen gold

మంగళసూత్రం చోరీ చేసిన ఓ దొంగ.. పోలీసులను చూసి దొరికిపోతాననే భయంతో ఆ గొలుసును మింగేశాడు. నగరంలోని చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. వారు శనివారం రాత్రి వాకింగ్ కోసం బయటకొచ్చారు. ఇంతలో వికాస్(22) అనే దొంగ ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రాన్ని తెంపుకుపోయాడు. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో వికాస్‌ను గుర్తించిన పోలీసులు అతడిని పోట్టుకోడానికి ప్రయత్నించారు. పోలీసులను చూసిన దొంగ దొరికిపోతాననే భయంతో జేబులో ఉన్న మంగళసూత్రాన్ని బలవంతంగా మింగేశాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. అతడు మింగిన మంగళసూత్రం కడుపు కింది భాగంలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసి ఎలాగైనా గొలుసును బయటకు తీయాలని వైద్యులను పోలీసులు కోరారు. కానీ ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకొచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు.
 



దీంతో ఆ దొంగను ఇన్‌పేషంట్‌గా చేర్చుకోవాలని పోలీసులు కోరారు. అయితే వైద్యులు అందుకు నిరాకరించారు. మంగళసూత్రం ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ ఎవరు గమనిస్తారని డాక్టర్లు పోలీసులను ప్రశ్నించారు. నిందితుడు పోలీసుస్టేషన్‌లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు డాక్టర్లతో అన్నారు. చివరకు ఎలాగోలా ఆ దొంగను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. కానీ ఆ దొంగ మింగిన మంగళసూత్రం ఎప్పుడు బయటకు వస్తుందో తెలియక... వైద్యులు సతమతమవుతుంటే.. దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thief  vikas  railway police  Mangalsutra  Fear Of Facing Arrest  

Other Articles