Hindupur MLA Balakrishna Makes Interesting Comments On Oppositions Controversies | Anantapur District Developments

Nandamuri balakrishna interesting comments hindupur anantapur district developments

balakrishna news, balakrishna updates, mla balakrishna, hindupur developments, anantapur district, balakrishna tour, balakrishna speech, balakrishna parody, balakrishna funny, tdp party, tdp controversies

Nandamuri Balakrishna Interesting Comments Hindupur Anantapur District Developments : Actor And Hindupur MLA Balakrishna Makes Interesting Comments On Oppositions Controversies. He Told That He Never Concentrate On Their Waste Speech.

‘అబ్బే.. నేను అలాంటివి ఏమాత్రం పట్టించుకోను’

Posted: 08/19/2015 01:15 PM IST
Nandamuri balakrishna interesting comments hindupur anantapur district developments

‘నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి.. మరేమైనా పనిచేస్తే నీకు నెక్ట్స్ బర్త్ డే వుండదు’ అనే ‘లెజెండ’రీ డైలాగ్ ప్రతిఒక్కరూ వినే వుంటారు. నందమూరి బాలకృష్ణ తన సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ ని నిజజీవితంలోనూ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా ఆయన చెప్పిన మాటలు వింటే అలాగే అనిపిస్తుంది మరీ!

బాలకృష్ణ కేవలం నటుడు మాత్రమే కాకుండా హిందూపురం ఎమ్మెల్యే అన్న విషయం అందరికీ తెలిసిందే! ఈయన అటు సినిమా షూటింగుల్లో బిజీగా వుంటూ తన నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మంత్రులతో భేటీ అయ్యారు. ఇదివరకే ఆయన అచ్చెన్నాయుతో మంతనాలు జరిపారు కూడా! ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర నేతలకు పూర్తి భిన్నంగా కొన్ని ఆసక్తికర అభిప్రాయాలను వెల్లడించారు. ‘ప్రతిపక్షాలు చేసే విమర్శలపై మీ స్పందనేంటి?’ అని ఆయన్ను ప్రశ్నించగా.. తాను అలాంటి విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోనని, అవి సర్వసాధారణమేనంటూ ఆయన అన్నారు. నిజానికి విమర్శ అన్న మాట వినగానే ఏ నాయకుడైనా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ.. బాలయ్య ఆ తరహాలో కాకుండా చాలా సాఫ్ట్ గా ‘వాటిని పట్టించుకోను’ అని సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే ఆయన తన నియోజకవర్గం హిందూపురంతోపాటు అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. తాను కేవలం హిందూపురానికి మాత్రమే పరిమితం కాదని, మొత్తం అనంతపురం జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని స్పష్టం చేశారు. హిందూపురంలో నీటి సమస్య అధికంగా వుందని, ఈ ఏడాది చివరకల్లా ఆ సమస్య తీరిపోయి, హిందూపురానికి పుష్కలంగా నీరు వస్తాయని తెలిపారు. అంతేకాదు.. సాంస్కృతిక, పర్యాటక, క్రీడల పరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా బాలకృష్ణ చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  hindupur  anantapur district  

Other Articles