Salman Khan Becomes Real Life Bajrangi Bhaijan By Reunites Runaway Kids

Salman khan reunites runaway kids real life bajrangi bhaijan

salman khan, salman khan latest news, bajrangi bhaijan, bajrangi bhaijan latest news, salman khan controversies, salman khan updates, bajrangi bhaijan collections, salman reunite runaway kids, salman real life incidents, salman being human

Salman Khan reunites runaway kids Real Life Bajrangi Bhaijan : Salman Khan Becomes Real Life Bajrangi Bhaijan By Reunites Runaway Kids.

సల్మాన్.. రియల్ లైఫ్ ‘బజరంగీ భాయిజాన్’?

Posted: 08/19/2015 06:22 PM IST
Salman khan reunites runaway kids real life bajrangi bhaijan

సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో తప్పిపోయిన ఓ పాకిస్థాన్ చిన్నారిని తిరిగి ఆమె స్వదేశంలోని కుటుంబంతో కలిపే కథాంశంతో తెరకెక్కిన ఆ చిత్రం.. సల్లూ భాయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా స్టోరీలైన్ నేపథ్యంలోనే రియల్ లైఫ్ లోనూ ఓ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న సంగతి విదితమే! ఇండియాకి చెందిన ఓ అమ్మాయి పాకిస్థాన్ లో వుందని, ఆమెని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం కూడా వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాను కూడా సహాయం చేస్తానంటూ సల్లూభాయ్ ఆ మధ్యలో ప్రకటించాడు కూడా! దీంతో అతనికి రియల్ లైఫ్ ‘బజరంగీ భాయిజాన్’ అని అభిమానులు వర్ణించుకున్నారు. అప్పుడు అలా సహాయం చేస్తే.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి, ‘బజరంగీ భాయిజాన్’గా అవతారమెత్తి, ఓ మంచి పని చేశాడు సల్లూ భాయ్!

ఇంటి నుంచి పారిపోయిన నలుగురు చిన్నారులను మళ్లీ వారి కుటుంబాలతో కలిపాడు సల్మాన్ ఖాన్. ఈ ప్రక్రియలో సల్మాన్ కు అంతర దేశాయ్ అనే సామాజిక కార్యకర్త కూడా సహాయపడ్డారు. మహారాష్ట్రలోని కర్జాత్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి కార్యక్రమాలే మరిన్ని చేపడతామని అంతర తెలిపారు. ఎంతోకాలంగా ఖర్చులన్నీ సల్మానే భరిస్తున్నారని, ఆయన నిజంగానే 'బజరంగీ భాయిజాన్' అని కొనియాడారు. మొత్తానికి ఆ చిత్రం సల్లూ కెరీర్ లో చాలా మార్పులే తీసుకొచ్చినట్లుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  bajrangi bhaijan  being human  

Other Articles