Do you work more than 8 hours a day? Heart Stroke Guaranteed!

Working overtime increases stroke risk

healthy office working hours, heart diseases for office working hours, standard office working hours, Office, working hours, health stroke threat, scientific study, more than 8 working hours

People who work longer than the standard 35 to 40 hour week run significantly higher risk of stroke, says the largest study conducted on this issue.

పని మరలారా.. తస్మాత్ జాగ్రత్తా..! అధిక పనిగంటలతో హృద్రోగాలు..

Posted: 08/20/2015 08:50 PM IST
Working overtime increases stroke risk

ప్రభుత్వ ఉద్యోగస్థులు రిటైరయిన తరువాత కూడా ఎంతో ఆరోగ్యంగా తమ జీవితాలను గడుపుతుంటారు. అది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, సెమీ గవర్నమెంటు, క్వాసీ గవర్నమెంటు, గవర్నమెంటు అండర్ టేకింగ్ సంస్థల ఇలా ఏ ప్రభుత్వ ప్రత్యేక్ష, పరోక్షంగా సంబంధమున్న ఏ సంస్థ అయినా సరే.. అందులో పనిచేసే వారు మాత్రం విరమణ తరువాత ప్రశాంత జీవనానికి అలవర్చుకుంటారు అందుకు కారణం వారి పనిగంటలే. ఇక ప్రైవేటు సంస్థలు, మార్కెటింగ్, చోటా, మోటా సాప్ట్ వేర్ సంస్థలల్లో పనిచేసే వారు మాత్రం పదవీ విరమణ పోందే అవకాశం కూడా వుండదట. ఒకవేళ పదవీ విరమణ పోందిన తరువాత కూడా వాళ్లు ప్రశాంత జీవినాన్ని మాత్రం గడపలేరట. అందుకు కారణాలు ఏమీటి..? అంటే..

వారానికి 35 నుంచి 40 పని గంటలు పనిచేసే వాళ్లు.. తమ జీవితంలో రక్తపోటు సహా హృద్రోగ సమస్యలను ఎదుర్కోకుండా చక్కగా తమ జీవితాలను సాగిస్తారట. అంతకన్నా అధికంగా పనిచేసే వాళ్లు మాత్రం గుండె సంబంధిత వ్యాధులతో తమ జీవనయానంలో సమస్యలను, ఇబ్బందులను అనారోగ్యాలను తెచ్చుకోక తప్పదంటోంది తాజా సర్వే. ఏదో ఒకరిద్దరు వ్యక్తులపై కాకుండా ఏకంగా ఆరు లక్షల మందిపై అధ్యయనం చేసిన తరువాత హృద్రోగాలకు మూల కారణం ఏమిటన్న విషయాన్ని తెలుసుకున్నారు లండన్ చేందిన పరిశోధకులు.

అధిక పనిగంటలు పనిచేయడంతో పాటు మానసిక ఒత్తడికి లోనకావడం వల్లే హృద్రోగ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైందని వారు స్సష్టం చేస్తున్నారు. వారినికి ఐదు రోజుల పాటు.. ఏడు నుంచి ఎనమిది గంటలు స్ఠాండర్ట్ పనిగంటలలో పనిచేసేవారితో పోల్చితే.. వారానికి 55 గంటలు పనిచేసే ఉద్యోగులలో 33 శాతం హృద్రోగ సంబంధ వ్యాధులు వస్తాయని, అది క్రమేనా కార్డియాక్ అరెస్టుకు కారణమవుతుందని కూడా వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతకన్నా అధికంగా పనిచేసే వారిలో మరో 13 శాతం అధికమైన రిస్క్ వుంటుందని అద్యయనాలు స్పష్టం చేస్తున్నాట్లు చెబుతున్నారు.

అధిక పనిగంటలు పనిచేస్తున్న వారిపట్ల అరోగ్య నిపుణలు అప్రమత్తంగా వుండాలని, దీర్ఘకాలిక పనిగంటలతో గుండె సంబంధిత వ్యాదులతో పోటు కూడా వచ్చే ప్రమాదముందని లండన్ కు చెందిన యూనివర్సిటీ అఫ్ ఎపిడిమియాలజీకి చెందిన ఫ్రోఫెసర్, పరిశోధక సభ్యుడు  మిక్కా, కివ్విమాకీ వెల్లడించారు. వారానికి 40 గంటలు పనిచేసే వారితో పోల్చితే 41 నుంచి 48 గంటలు పనిచేసే వారికి 10 శాతం, 49 నుంచి 54 గంలు పనిచేసేవారికి 27 శాతం, అంతకన్నా అధికంగా పనిచేసే వారికి 33 నుంచి 40 శాతం గుండెపోటు వచ్చేందుకు అస్కారాలు వున్నాయని తమ అధ్యయనాల్లో తేలిందని వెల్లడించారు.

మొత్తం ఆరులక్షల మూడు వేల 838 మందిపై యూరోప్ , అమెరికా, అస్ట్రేలియాలకు చెందిన వారిపై తమ అధ్యయనం సాగిందని చెప్పారు. క్రమపద్దతిలో ఆరు లక్షల మందిపై రివ్యూలు చేసి.. వారి మెటా అనాలసిస్ ను పరిగణలోకి తీసుకుని వారు పనిచేస్తున్న పని గంటల అధారంగా గత ఏడాది ఆగస్టు 20 నుంచి తమ పరిశోధన సాదింగని కివ్విమాకీ వెల్లడించారు. అయితే హృద్రోగం సంక్రమించడంలో లింగబేధం లేదని కూడా తమ అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. దీనికి తోడు పనిఒత్తిడి నేపథ్యంలో సుఖనిద్ర కోసం మధ్యాన్ని అతిగా సేవించడం, కొందరు అధిక నిద్రకు ఉపక్రమించడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా హృద్రోగాలకు కారణమవుతున్నాయని వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Office  working hours  health stroke threat  scientific study  

Other Articles