Narayana | CPI | Venkiah Naidu | CPI Narayana

Cpi narayana commented on central minister venkiah naidu

Narayana, CPI, Venkiah Naidu, CPI Narayana, Hen, chicken, Comments on Venkiah Naidu

CPI Narayana commented on central Minister Venkiah Naidu. Venkiah Naidu and Chandrababu Naidu appriciate each other in a function.

వెంకయ్య మీద ‘కోడి’ కామెంట్ చేసిన నారాయణ

Posted: 08/21/2015 01:54 PM IST
Cpi narayana commented on central minister venkiah naidu

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపి రాష్ట్రానికి తాను ఎంతో మేలు చేస్తున్నానని.. తాను వచ్చిన ప్రతి సారీ రాష్ట్రానికి ఏదో ప్రాజెక్ట్ తీసుకువస్తున్నానని తెగ భాజా భజాయించారు. ఇక ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా వెంకయ్య నాయుడు సూపర్.. తరుము అంటూ తెగ పొగిడారు. వెంకయ్య నాయుడు వల్లే రాష్ట్రానికి మంచి జరిగిందని.. భవిష్యత్తులో మరింత మంచి జరుగుతుందని తెగ మోసేశారు చంద్రబాబు నాయుడు. అయితే సొంత డబ్బాలు కొట్టుకున్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నాయుడు ద్వయం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శిస్తున్నాయి. అయితే వాళ్లు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. కాగా మాట్లాడాల్పిన వాళ్లు మాట్లాడితే సూపర్ న్యూస్ అవుతుంది అన్నది వాస్తవం. అందుకే కోడి అన్నా చికెన్ అన్నా మొదటగా గుర్తుకు వచ్చే ఓ పాపులర్ నేత వెంకయ్య నాయుడు మీద కోడి కామెంట్ చేశారు.

 

కోడి లేదంటే చికెన్ అంటే ముందు గుర్తుకువచ్చే పేరు సిపిఐ నారాయణ. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలుస్తున్నాయి.  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుపై సీపీఐ జాతీయ నేత నారాయణ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  'నేను లేకుంటే మీకు దిక్కులేదు' అన్న వెంకయ్య వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంకయ్య నాయుడు ధోరణి... తన కోడి లేకపోతే తెల్లారదు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్పై ప్రేమ ఉందంటున్న వెంకయ్య నాయుడు, నరేంద్ర మోదీలది కొంగ జపమే అని నారాయణ మండిపడ్డారు. తల్లిపాలకు, పోతపాలకు తేడాలేదా? అలాగే ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఉంటుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayana  CPI  Venkiah Naidu  CPI Narayana  Hen  chicken  Comments on Venkiah Naidu  

Other Articles