తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్ గట్టిగానే ఇరికించాడు. తెలంగాణ ప్రభుత్వం మీద రోజుకో విధంగా ఆరోపణలు చేస్తూ సర్కారు పనితీరును ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి కేటీఆర్ సవాల్ నేపథ్యంలో దానిని స్వీకరిస్తాడా ? లేదా ? అని అందరూ ఉత్కంఠగా వేచిచూస్తున్నారు. “బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నిజంగా కేంద్రంలో పలుకుబడి ఉంటే తెలంగాణకు లక్షకోట్ల ప్యాకేజీ తేవాలి. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. బీహార్ కు మోడీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలు కేంద్రం వద్దకు వెళ్లి తెలంగాణకు ప్యాకేజీ గురించి ప్రశ్నించాలని” కేటీఆర్ సూచించారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలుపుతున్నప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ను జిల్లా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడని మరి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు జిల్లాను చేయలేదని ప్రశ్నించారు. కేటీర్ అడిగినట్లు బీజేపీ నేతలు లక్ష కోట్లు కాకపోయినా 50 వేల కోట్లు కనీసం 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ తెచ్చినా బాగుండు.పాపం ఉరిమి ఉరిమి ఊరి మీద పడ్డట్లు.. తెలంగాణలో బిజెపి వాళ్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కేటీఆర్ ఇలా ఫిటింగ్ పెట్టడం ఎంత వరకు మాత్రం సబబు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more