sensex | nifty | bombay stock

Sensex opened more than 900 points lower

sensex, nifty, bombay stock, stock exchange, share value, Rupee value

Sensex opened more than 900 points lower Sensex opened more than 900 points lower as Asian stocks dived to 3-year lows on Monday.Asian stocks dived to 3-year lows on Monday as a rout in Chinese equities gathered pace, hastening an exodus from riskier assets as fears of a China-led global economic slowdown roiled world markets.

బ్యాడ్ మార్నింగ్.. నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం

Posted: 08/24/2015 10:28 AM IST
Sensex opened more than 900 points lower

స్టాక్ మార్కెట్ అంటేనే చదరంగం లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఉదయం మాత్రం స్టాక్ మార్కెట్ వర్గాలకు భారీ నష్టాన్ని రుచిచూపించింది. అంతర్జాతీయంగా ఉన్న రకరకాల కారణాలు, పరిస్థితులు స్టాక్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రూపాయి మారకం విలువ రోజు రోజుకు పతనమవుతోందని అసలే భయపడుతున్న భారత స్టాక్ హోల్డర్లకు నేటి ఉదయం భారీ నష్టమే వాటిల్లింది. ఈ ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.49కి దిగజారింది. గత రెండేళ్లలో కనిష్టంగా రూపాయి మారకం విలువ నమోదైనట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాపయడుతున్నారు. చైనా తన కరెన్సీ యాన్ విలువను తగ్గించడం ఫలితంగా అంర్జాతీయ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం కనిపించింది. అయితే ఈ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బహుశా సాయంత్రం వరకు పతనం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  bombay stock  stock exchange  share value  Rupee value  

Other Articles